లైంగిక జీవితాన్ని మెరుగుపరుచుకునేందుకు తీసుకోవాల్సిన ఆహారాలపై  స్వీడన్ కు చెందిన ఓ సంస్థ పరిశోధన చేసింది. ఆరు దేశాల్లో సుమారు 1.7 కోట్ల మందిపై పరిశోధన చేసింది.  ఈ డేటాను విశ్లేషించి ఈ ఆహారాలు తీసుకుంటే లైంగిక సామర్థ్యం మెరుగుపడిందని, ఏ ఆహారాలు మానుకోవాలో పేర్కొంది.  

pexels

By Bandaru Satyaprasad
Apr 16, 2025

Hindustan Times
Telugu

ఈ పరిశోధనలో లైంగిక చర్యలకు ముందు, తర్వాత తీసుకున్న ఆహారాలపై ట్రాక్ చేశారు. మొత్తం 2,563 ఆహారాలను ట్రాక్ చేయగా... చాక్లెట్ అత్యంత ప్రజాదరణ పొందింది. వరుసగా టమోటాలు, బ్రెడ్, ఆపిల్స్, ఆలూ, కాఫీ, అరటిపండ్లు, వైన్, చీజ్ , స్ట్రాబెర్రీల వంటి ఆహారాలను ఆస్వాదించారు.   

pexels

మీ లైంగిక జీవితం ఆరోగ్యంగా ఉండేందుకు ఈ 5 ఆహారాలను మీ దినచర్యలో చేర్చుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.  ఈ సూపర్‌ఫుడ్స్ యాంటీఆక్సిడెంట్ లక్షణాలకు,   లైంగిక అవయవాలకు రక్త ప్రవాహాన్ని పెంచడానికి ప్రసిద్ధి చెందినవి.  

pexels

అవిసె గింజలు - వీటిలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మీ లిబిడోకు ప్లస్ అవుతాయి.  ఇందులోని ఎల్ అర్జినిన్ అమైనో యాసిడ్ రక్త ప్రవాహాన్ని పెంచి, స్పెర్మ్‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి. 

pexels

అవకాడో - అవకాడో విటమిన్ ఈ తో నిండి ఉంటాయి. విటమిన్ ఈ రక్త నాళాలను వెడల్పు చేసే కీలకమైన యాంటీఆక్సిడెంట్. ఇవి రక్త నాళాలు, గుండే సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. ఇది స్పెర్మ్ డీఎన్ఏ నష్టాన్ని కూడా తగ్గిస్తుంది. అవకాడోలోని పొటాషియం లిబిడో, లైంగిక శక్తిని పెంచుతుంది.  

pexels

దానిమ్మ గింజలు- దానిమ్మ గింజల్లో పాలీఫెనాల్స్‌ ఉంటాయి. పాలీఫెనాల్స్ అధిక రక్తపోటు, గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించే లక్షణాలు కలిగి ఉంటాయి. ఇవి రక్త నాళాలను సడలించి మెదడు, గుండెకు రక్త సరఫరాను పెంచుతాయి.  లైంగిక హార్మోన్లను తయారు చేయడానికి బిల్డింగ్ బ్లాక్‌లను అందించే సూక్ష్మపోషకాలు దానిమ్మ గింజల్లో ఉంటాయి.  ఫ్లేవోన్‌లు  అంగస్తంభన ఆరోగ్యానికి కీలకమైనవి.  

pexels

గుమ్మడికాయ గింజలు - వీటిలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇవి యాంటీఆక్సిడేటివ్, యాంటీహైపెర్టెన్సివ్, కార్డియోప్రొటెక్టివ్ పోషకాలను కూడా కలిగి ఉంటాయి. ఇవన్నీ  లైంగిక ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్  స్త్రీ జననేంద్రియ, ప్రోస్టేట్ ఆరోగ్యానికి సహాయపడతాయి.   

pexels

ఆయిస్టర్స్ - ఈ సున్నితమైన సముద్ర ఆహారంలో లైంగిక పరిపక్వతకు కీలకమైన జింక్ పుష్కలంగా ఉంటుంది. జింక్ మీ శరీరం లైంగిక కోరికతో ముడిపడి ఉన్న టెస్టోస్టెరాన్ హార్మోన్‌ను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. అలాగే అవసరమైన థైరాయిడ్ హార్మోన్లను సంశ్లేషణ చేయడంలో సహాయపడుతుంది. 

pexels

మీ లైంగిక సామార్థ్యం పెరిగేందుకు కొన్ని ఆహార జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చూస్తున్నారు.  ప్రాసెస్ చేసిన ఆహారాలను రోమాంటిక్ లైఫ్ పై ప్రభావం చూపుతాయని వెల్లడించారు. ఉప్పు, చక్కెర అధికంగా ఉన్న ఆహారాలను పరిమితం చేయడం, కొవ్వు ఆహారాలు తగ్గించడం ఉత్తమం అని సూచించారు. లైంగిక చర్యల తర్వాత ఈ ఆహారాలు తీసుకోకపోవడం మంచిది.  

pexels

మద్యం మీ లైంగిక సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది. రోమాంటిక్ లైఫ్ ను డిస్టర్బ్ చేస్తున్న వాటిలో మద్యం ఒకటని ఒక అధ్యయనంలో తేలింది.  

pexels

లైంగిక చర్యల తర్వాత చాలా మంది బ్రెడ్, చీజ్‌ ఆహారాలు ఎంచుకుంటున్నారు. ఇవి  లైంగిక లిబిడోపై ప్రభావం చూపుతున్నాయి.   

pexels

నట్స్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు కలిగిన చేపలు, పండ్లు, ఆకుకూరలతో కూడిన ఆహారాన్ని ఇష్టపడే వారు శృంగారపరంగా చురుకుగా ఉండే అవకాశం ఉంది.  లైంగిక ఆనందాన్ని పొందుతారని అధ్యయనాలు చెబుతున్నాయి.  

pexels

గోల్డ్ కలర్ చీరలో ప్రణీత అందాల ధగధగలు: ఫొటోలు

Photo: Instagram