హైపీబీ ఉంటే ఇలాంటి ఆహారాలు అసలు తినకూడదు!

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Feb 18, 2025

Hindustan Times
Telugu

హై బ్లడ్ ప్రెజర్ (హైబీపీ) ఉంటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. అందుకే బీపీ అదుపులో ఉండేలా పెరగకుండా జాగ్రత్తలు పాటించాలి. అందుకే హైబీపీ ఉన్న వారు ఫుడ్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. 

Photo: Pexels

కొన్ని రకాల ఆహారాలు తినడం వల్ల బీపీ పెరిగిపోతుంది. అలాంటి వాటికి దూరంగా ఉండాలి. అలా హైబీపీ ఉన్న వారు తీసుకోకూడని ఐదు రకాల ఫుడ్స్ ఏవంటే..

Photo: Pexels

మటన్, బీఫ్ లాంటి రెడ్ మీట్‍ను హైబీపీ ఉన్న వారు ఎక్కువగా తినకూడదు. వీటిని తీసుకుంటే కొలెస్ట్రాల్  శరీరంలో ఎక్కువవుతుంది. బీపీ పెరగటంతో పాటు గుండెకు చేటు జరిగే రిస్క్ ఉంటుంది. 

Photo: Pexels

హైబీపీ ఉన్న వారు పచ్చళ్లను ఎక్కువగా తినకూడదు. పచ్చళ్లు నిల్వ ఉండేందుకు ఉప్పును అధికంగా వాడతారు. దీంతో ఇవి తింటే శరీరంలో సోడియం పెరిగి.. బీపీ కూడా అధికమవుతుంది. 

Photo: Pexels

అలాగే ఉప్పు అధికంగా ఉండే ఆహారాలు ఎక్కువగా తీసుకోకూడదు. కావాల్సిన దాని కంటే తక్కువగా ఉప్పు వాడాలి. ఉప్పు బ్లడ్ ప్రెజర్‌ను పెంచేస్తుంది. అందుకే సాల్టీ ఫుడ్స్ తినకూడదు. 

Photo: Pexels

తీపి పదార్థాలు, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఫ్రై చేసిన ఫుడ్స్ కూడా హైబీపీ ఉన్న వారు ఎక్కువగా తీసుకోకూడదు. వీటిలో బ్లడ్ ప్రెజర్‌ను పెంచగల కారకాలు ఉంటాయి. వీటివల్ల కొవ్వు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. 

Photo: Pexels

హైబీపీ ఉన్న వారు ఆల్కహాల్ అసలు తీసుకోకూడదు. దీనివల్ల శరీరంలో బ్లడ్ ప్రెజర్ అమాంతం పెరిగే రిస్క్ ఉంటుంది. అందుకే ఆల్కహాల్ అలవాటు ఉంటే మానేసేయాలి.

Photo: Pexels

రొమ్ము క్యాన్సర్‌ను  గుర్తించేదెలా...? 7 ముఖ్యమైన విషయాలు

image credit to unsplash