వ్యాయామానికి ముందు శక్తి పెరిగేందుకు 5 రకాల ఆహారాలు

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Jul 10, 2024

Hindustan Times
Telugu

వ్యాయామం సమయంలో శరీరం మెరుగ్గా ఉండేందుకు ముందుగా పోషకాలతో ఉన్న ఆహారం తినడం సహకరిస్తుంది. వ్యాయామానికి ముందు శక్తి పెంచే ఐదు రకాల ఆహారాలు ఇవే. 

Photo: Pexels

పీనట్ బటర్‌లో ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. దీన్ని తీసుకోవడం ద్వారా శరీరానికి మంచి శక్తి అందుతుంది. 

Photo: Pexels

అరటి పండ్లలో నేచురల్ షుగర్స్, కార్బొహైడ్రేట్లు, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ పండు తింటే ఎనర్జీని పెరుగుతుంది. 

Photo: Pexels

బాదం, ఆక్రోటు లాంటి డ్రైఫ్రూట్స్ కూడా శరీరానికి త్వరగా శక్తిని అందిస్తాయి. వీటిలో ఉండే వివిధ రకాల పోషకాలు ఎనర్జీ పెరిగేందుకు సహకరిస్తాయి. 

Photo: Pexels

కోడిగుడ్లలో ప్రొటీన్, ఆమినో యాసిడ్ లెయిన్సిన్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తి ఇవ్వటంతో పాటు కండరాలు పెరిగేందుకు కూడా తోడ్పడతాయి. 

Photo: Pexels

కాఫీలో కెఫీన్ ఉంటుంది. ఇది ఓ సప్లిమెంట్‍లా పని చేసి.. చురుకుదనాన్ని పెంచుతుంది. వ్యాయామం మెరుగ్గా చేసేందుకు ఉపయోగపడుతుంది. 

Photo: Pexels

పాము కాటు వేస్తే ఏం చేయాలి?

Photo Credit: Pexels