పరీక్షల సమయంలో ఒత్తిడి ఎక్కువగా ఉందా? ఈ టిప్స్ పాటించండి
Photo: Pexels
By Chatakonda Krishna Prakash Jan 29, 2025
Hindustan Times Telugu
పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో కొందరికి ఒత్తిడి, ఆందోళన అధికం అవుతాయి. ఒత్తిడి ఎక్కువగా ఉంటే సరిగా ఏకాగ్రత ఉండదు.
Photo: Pexels
అందుకే ఒత్తిడి తగ్గేందుకు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పరీక్షల సమయంలో పాటించాల్సిన టిప్స్ ఏవో ఇక్కడ చూడండి.
Photo: Pexels
ప్రతీ రోజు ధ్యానం (మెడిటేషన్) చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఏకాగ్రత మెరుగవుతుంది. జ్ఞాపకశక్తి కూడా ఇంప్రూవ్ అవుతుంది.
Photo: Pexels
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే ఆహారాలను డైట్‍లో తినాలి. నట్స్, సీడ్స్, పండ్లు, కూరగాయలు లాంటివి తీసుకోవాలి. ఒత్తిడి తగ్గేందుకు ఇవి ఉపకరిస్తాయి. పూర్తి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.
Photo: Pexels
ఒత్తిడి తగ్గేందుకు వ్యాయామాలు కూడా చాలా ఉపయోగపడతాయి. ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల శరీరంలో ఫీల్ గుడ్ హార్మోన్ల ఉత్పత్తి మెరుగై మెదడు ప్రశాంతంగా ఉంటుంది.
Photo: Pexels
ఒత్తిడి తగ్గేందుకు సరిపడా నిద్ర కూడా ముఖ్యం. తగినంత నిద్రపోతే మెదడు రిలాక్స్‌గా ఉంటుంది. మానసిక ఆరోగ్యం బాగుంటుంది.
Photo: Pexels
పరీక్షలు ఉన్నాయని ఏకధాటిగా చదువుతూ ఉండకూడదు. మధ్యలో చిన్నచిన్న బ్రేక్స్ తీసుకుంటుండాలి. స్వల్ప విరామాలు ఇస్తూ చదువుతుండాలి. ఇతర యాక్టివిటీలు కాసేపు చేయాలి. దీనివల్ల మైండ్ రిలాక్స్ అవుతుంది.