దోశ పిండి త్వరగా పులిసిపోకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి
By Haritha Chappa Mar 24, 2025
Hindustan Times Telugu
అల్పాహారం కోసం దోశనే అధికంగా తింటూ ఉంటారు. దోశ పిండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. కానీ త్వరగా పులిసిపోతుంది.
దోశ పిండి పులిసిపోతే, మీరు దానితో దోశ వేయలేరు. దీన్ని తింటే పుల్లటి రుచి వస్తుంది.ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకోండి.
దోశ పిండి పులియకుండా ఎక్కవు రోజులు ఎలా నిల్వ చేయాలో తెలుసుకోండి.
మూడు గ్లాసుల బియ్యం, ఒకటిన్నర గ్లాసుల మినపప్పు వేరువేరుగా నీటిలో నాబెట్టుకోవాలి. బియ్యంలో రెండు టేబుల్ స్పూన్ల మెంతులు కూడా వేసి నానబెట్టుకోవాలి. మెంతులు దోశలు మెత్తగా వచ్చేలా చేస్తాయి.
ఇవి నానక మెత్తగా రుబ్బి ఒక గిన్నెలో వేయాలి. ఆ పిండిని రెండుగంటల పాటూ బయటే ఉంచాలి. తరువాత మూడు గంటలు ఫ్రిజ్ లో పెట్టాలి. ఆ తరువాత తీసి దోశె వేసుకుంటే టేస్టీగా ఉంటుంది.
బియ్యాన్ని రుబ్బుతున్నప్పుడు అందులో ఐస్ క్యూబ్స్ వేయాలి. అప్పుడు పిండి నెమ్మదిగా పులుస్తుంది. పుల్లని రుచి రావడానికి ఎక్కువకాలం పడుతుంది.
గుడ్డులోని తెల్లసొనను వేరు చేసి దోశె పిండిలో వేసి బాగా కలపాలి. తర్వాత ఫ్రిజ్ లో భద్రపరుచుకోవాలి. ఇలా చేస్తే త్వరగా పులుపు రుచి రాదు.
పిండి పులియకుండా ఉండేందుకు ఒక స్పూను చక్కెరను కలపండి. ఇది అదనపు ఎసిడిటీని తొలగిస్తుంది. చిటికెడు చక్కెర జోడించడం వల్ల రుచిని సమతుల్యం చేస్తుంది. పుల్లని రుచిని తగ్గించడానికి సహాయపడుతుంది.
పులిసిన దోశ పిండిని పడేయాల్సిన అవసరం లేదు. అందులో కొద్దిగా బియ్యప్పిండి కలపాలి. తర్వాత అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల పిండిలోని పులుపు తగ్గుతుంది. ఈ పిండిని వాడితే క్రంచీ దోశలు వస్తాయి.
తక్కువ వడ్డీకే పర్సనల్ లోన్ పొందడం ఎలా?
తక్కువ వడ్డీకే పర్సనల్ లోన్ పొందడానికి టాప్ 5 ట్రిక్స్