జుట్టు సహజంగా ఒత్తుగా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి

Photo: Unsplash

By Chatakonda Krishna Prakash
Aug 10, 2024

Hindustan Times
Telugu

జుట్టు ఒత్తుగా ఉండాలంటే కొన్ని సూచనలు పాటించాలి. సహజంగా వెంట్రుకలను దృఢంగా ఉంచుకోవచ్చు. జుట్టు ఒత్తుగా ఉండాలంటే ఫాలో కావాల్సిన కొన్ని ముఖ్యమైన టిప్స్ ఇవి.  

Photo: Pexels

ఆల్మండ్, కస్టర్, ఉసిరి, రోస్‍మేరి నూనెలతో మీ జుట్టు కుదుళ్లకు మసాజ్ చేసుకోండి. దీనివల్ల హెయిర్ ఫోలిసిల్స్ పెరిగి, రస్తప్రసరణ మెరుగవుతుంది. జుట్టు ఒత్తుగా ఉంటుంది. 

Photo: Pexels

తల స్నానం చేసిన సందర్భాల్లో జుట్టుకు హెయిర్ కండీషనర్ పూసుకోవాలి. జుట్టు చిక్కులు పడకుండా, మృధుత్వం తగ్గకుండా ఇది చేయగలదు. వెంట్రుకలు పొడిబారడాన్ని తగ్గించి, ఒత్తుగా ఉండేందుకు తోడ్పడుతుంది. 

Photo: Pexels

కెమికల్స్ లేని షాంపూతో తలస్నానం చేయాలి. కెమికల్స్ వల్ల జుట్టు సన్నబడి, రాలే రిస్క్ ఉంటుంది. కెమికల్ ఫ్రీ షాంపూ వాడితే జుట్టు శుభ్రంగా అవడంతో పాటు చుండ్రు పోతుంది. జుట్టులో తేమ మెరుగ్గా ఉంటుంది. 

Photo: Pexels

జుట్టును పొడిగా చేసుకునేందుకు హెయిర్ డ్రయర్స్ ఎక్కువగా వాడకూడదు. వీటి వల్ల జుట్టు పలచబడే ప్రమాదం ఉంటుంది. తల స్నానం చేసిన తర్వాత జుట్టును కాటన్ టవల్‍తో తుడుచుకొని, సహజంగా పొడిబారేలా చేసుకోండి. 

Photo: Pexels

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్స్ లాంటి పోషకాలు ఎక్కువగా ఉండే కూరగాయలు, పండ్లు, కాయధాన్యాలు, నట్స్, సీడ్స్ తినాలి. జుట్టు ఒత్తుగా ఉండేందుకు, పెరుగుదలకు ఇవి చాలా సహకరిస్తాయి. 

Photo: Pexels

కీర్తి సురేష్ త‌మిళ్ మూవీ ర‌ఘు తాత మ‌రికొద్ది గంట‌ల్లో ఓటీటీలోకి రాబోతోంది. 

twitter