జ్ఞాపక శక్తిని పెంచుకోవాలనుకుంటున్నారా? ఈ 6 ఫాలో అవండి!
Photo: Pexels
By Chatakonda Krishna Prakash May 20, 2025
Hindustan Times Telugu
జ్ఞాపక శక్తి మెరుగ్గా ఉండాలంటే కొన్ని పనులు రెగ్యులర్‌గా చేస్తుండాలి. వీటి వల్ల మెదడు పనితీరు, చురుకుదనం కూడా మెరుగ్గా ఉంటుంది. అలా జ్ఞాపక శక్తిని పెంచగలిగే 6 టిప్స్ గురించి ఇక్కడ చూడండి.
Photo: Pexels
రెగ్యులర్‌గా ధ్యానం (మెడిటేషన్) చేయడం వల్ల జ్ఞాపక శక్తి మెరుగవుతుంది. ఏకాగ్రత, మానసిక ప్రశాంతత పెరుగుతాయి. మెదడు ఆరోగ్యానికి ధ్యానం చాలా మేలు చేస్తుంది.
Photo: Pexels
ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలు, కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండడం వల్ల మెదడు చురుగ్గా ఉంటుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఊహలు కూడా క్రియేటివ్‍గా ఉండాలి.
Photo: Pexels
సరిపడా నిద్ర వల్ల కూాడా మెదడు మెరుగ్గా ఉంటుంది. రోజులో కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోతే మెదడుకు మంచి జరుగుతుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత బాగుండేందుకు నిద్ర కూడా చాలా ముఖ్యం.
Photo: Pexels
జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉండాంటే మానసిక ఒత్తిడిని నియంత్రించుకోవాలి. ఒత్తిడి తగ్గేందుకు ధ్యానం, యోగా, బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‍లు లాంటివి చేస్తుండాలి. ఒత్తిడికి గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
Photo: Pexels
పోషకాలు ఎక్కువగా ఉండే కూరగాయాలు, పండ్లు, నట్స్, విత్తనాలు, ధాన్యాలు లాంటివి తినడం వల్ల మెదడు ఆరోగ్యం మెరుగ్గా ఉండేందుకు సహకరిస్తాయి. షుగర్, ప్రాసెస్డ్, ఫ్రైడ్, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోకూడదు.
Photo: Pexels
మెదడుకు పనిపెట్టే ఆటలను తరచూ ఆడుతుండాలి. సుడోకు, క్రాస్ వర్డ్స్ పజిల్, చెస్ లాంటి గేమ్స్ ఆడాలి. వీటివల్ల మెదడు చురుకుదనం పెరుగుతుంది. జ్ఞాపకశక్తి బాగుంటుంది.
Photo: Pexels
వాకింగ్ చేస్తున్నారా?..
నడిచేటప్పుడు ఈ తప్పులు చేయకండి..