ఒత్తిడి ఎక్కువగా ఉందా? ఈ చిట్కాలు పాటించండి

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Dec 28, 2024

Hindustan Times
Telugu

ప్రస్తుత కాలంలో చాలా మంది మానసిక ఒత్తిడితో బాధపడుతుంటారు. ఎక్కువ కాలం తీవ్రమైన ఒత్తిడి కొనసాగితే కొన్ని దీర్ఘకాలిక మానసిక, శారీరక సమస్యలు తలెత్తుతాయి.

Photo: Pexels

అందుకే ఓవరాల్ ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే ఒత్తిడి తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. అందుకు కొన్ని చిట్కాలు ఉపయోగపడతాయి. ఒత్తిడి తగ్గేందుకు ఉపయోగపడే కొన్ని టిప్స్ ఇక్కడ చూడండి. 

Photo: Pixabay

ఒత్తిడి తగ్గేందుకు ధ్యానం (మెడిటేషన్) ఎంతగానో తోడ్పడుతుంది. ప్రతీ రోజు ధ్యానం చేయడం వల్ల ఆందోళన, ఒత్తిడి బాగా తగ్గుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. 

Photo: Pexels

పెంపుడు జంతువులతో సమయం గడపడం వల్ల కూడా మానసిక ఒత్తిడి అదుపులోకి వస్తుంది. పెట్స్‌తో ఉంటే శరీరంలో ఆక్సిటోసిన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. దీంతో ఒత్తిడి, ఒంటరితనం లాంటి ఫీలింగ్స్ తగ్గుతాయి. 

Photo: Pixabay

చామంతి నూనె, లావెండర్, గంధపుచెక్క నూనె లాంటి ఎసెన్షియల్ ఆయిల్స్ పీల్చడం వల్ల కూడా మానసిక ఒత్తిడి బాగా అదుపులోకి వస్తుంది. మనసుకు హాయిగా ఉండటంతో పాటు నిద్ర కూడా బాగా పట్టేందుకు ఇవి ఉపయోగపడతాయి. 

Photo: Pexels

ఆలోచనలు, ఎమోషన్లను ఓ పుస్తకంలో రాసుకోవాలి. దీనివల్ల కూడా ఒత్తిడి తగ్గుతుంది. ఇలా రాయడం వల్ల సవాళ్లపై ఆందోళన కూడా నియంత్రణలో ఉంటుంది. 

Photo: Pexels

ఎక్కువ పనులు ఒకేసారి ఉండడం వల్ల కూడా ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. అందుకే టైమ్ మేనేజ్‍మెంట్ చేసుకోవాలి. ఏ పని ఎప్పుడు చేయాలో షెడ్యూల్ చేసుకోవాలి. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది. 

Photo: Pexels

పండ్లు నేరుగా తినడం మంచిదా.. జ్యూస్ మేలా?

Photo: Pexels