బరువు తగ్గేందుకు డైట్, వర్కౌట్లతో పాటు ఇవి కూడా ముఖ్యమే!
Photo: Pexels
By Chatakonda Krishna Prakash Apr 26, 2025
Hindustan Times Telugu
బరువు తగ్గేందుకు క్యాలరీలు తక్కువగా.. ప్రొటీన్, ఫైబర్, పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలు తినాలి. అలాంటి ఫుడ్స్ తీసుకుంటూ డైట్ పాటించాలి.
Photo: Pexels
బరువు తగ్గేందుకు రెగ్యులర్‌గా వ్యాయామాలు కూడా చేయాలి. క్యాలరీలు కరిగించాలి. డైట్, వ్యాయామాల విషయం చాలా మందికి తెలిసినా.. వెయిట్ లాస్ కావాలంటే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. అవేవంటే..
Photo: Pexels
బరువు తగ్గాలనుకునే వారికి నిద్ర కూడా చాలా ముఖ్యం. రోజుకు కనీసం 6 నుంచి 8 గంటలు పాటు మంచి నిద్ర ఉండాలి. సరైన నిద్ర లేకపోతే హర్మోన్ల అసమతుల్యత వల్ల బరువు పెరిగే రిస్క్ ఉంటుంది.
Photo: Pexels
వెయిట్ లాస్ కావాలనుకునే వారు మానసిక ఒత్తిడి కూడా చెందకూడదు. ఒత్తిడి ఎక్కువగా ఉంటే ఆకలి పెరుగుతుంది. పొత్తికడుపులో కొవ్వు పెరిగే ఛాన్స్ ఉంటుంది. అందుకే బరువు తగ్గాలనుకునే వారు ఒత్తిడి తగ్గేలా ధ్యానం, యోగా, బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‍లు చేయాలి.
Photo: Pexels
బరువు తగ్గాలనుకునే వారు రోజులో తగినంత నీరు తప్పనిసరిగా తాగాలి. హైడ్రేషన్ మెరుగ్గా ఉంటే శరీరంలో జీవక్రియ బాగుంటుంది. క్యాలరీలు బాగా కరిగేందుకు తోడ్పడుతుంది. ఎక్కువ ఆహారం తీసుకోకుండా ఉండేందుకు కూడా నీరు తాగడం ఉపకరిస్తుంది.
Photo: Pexels
వెయిట్ లాస్ కావాలనునే వారు ఆల్కహాల్ తాగడం మంచిది కాదు. ఆల్కహాల్‍లో క్యాలరీలు ఎక్కువ. ఫ్యాట్ కరిగే ప్రక్రియను ఇది బాగా తగ్గిస్తుంది. అందుకే బరువు తగ్గాలనుకునే వారు ఆల్కహాల్ మానేస్తే మంచిది.
Photo: Pexels
పోషకాలు ఉండే ఆహారం తీసుకోవడం పాటు తినే విధానం కూడా ముఖ్యం. ఆహారాన్ని వేగంగా కాకుండా నెమ్మదిగా నమిలి మింగాలి. దీనివల్ల ఆహారం బాగా జీర్ణమవుతుంది. తినే సమయాల్లో వేరే విషయాలపై దృష్టి పెట్టకూడదు. ఎంత తింటున్నామనేది ఆలోచించాలి.
Photo: Pexels
30ఏళ్ల వయసులో కెరీర్‌ను ఎలా మలుచుకోవాలి? ఈ వయసులో వచ్చే అత్యంత ముఖ్యమైన మార్పులు ఏమిటి?