గుండె బాగుండాలంటే ఫుడ్ విషయంలో ఈ జాగ్రత్తలు పాటించండి!
Photo: Unsplash
By Chatakonda Krishna Prakash Jan 08, 2025
Hindustan Times Telugu
శరీరంలో గుండె అత్యంత ముఖ్యమైన అవయవం. అందుకే దాని ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. గుండె ఆరోగ్యానికి తీసుకునే ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది.
Photo: Pexels
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఫుడ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. అవేవంటే..
Photo: Pexels
విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లతో సహా మరిన్ని పోషకాలు ఉండే కూరగాయలు, పండ్లను ప్రతీ రోజూ తినాలి. డైట్‍లో ఇవి తప్పనిసరిగా ఉండాలి. వీటిలోని పోషకాలు గుండె వ్యాధుల రిస్క్ తగ్గిస్తాయి.
Photo: Pixabay
ఆహారంలో ఉప్పు తగ్గించాలి. మోతాదు కంటే ఎక్కువ తీసుకోకూడదు. ఉప్పులో ఉండే సోడియం వల్ల బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది. గుండెపై ఒత్తిడి పడుతుంది. అందుకే ఉప్పు తక్కువగా తీసుకోవడం గుండెకు మంచిది.
Photo: pixabay
ఆహారాన్ని మోతాదు మేరకు తినాలి. అతిగా తీసుకుంటే బరువు పెరగడం సహా మరిన్ని దుష్ప్రభావాలు ఉంటాయి. ఇది గుండె పనితీరుకు ముప్పుగా ఉంటుంది. అందుకే ఆహారాన్ని శరీరానికి అవసరమైన మేర తినాలి.
Photo: Pexels
ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ ఉండే నట్స్, సీడ్స్, అవకాడో, ఆలివ్ ఆయిల్ లాంటివి ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఫుడ్స్ కూడా తీసుకోవాలి.
Photo: Pexels
షుగర్ ఎక్కువగా ఉండే కూల్‍డ్రింక్స్, తీపిపదార్థాలు లాంటివి ఎక్కువగా తీసుకోకూడదు. ప్రాసెస్డ్ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్ లాంటివి బాగా తగ్గించాలి. ఇవి ఎక్కువగా తింటే కొలెస్ట్రాల్ పెరిగి గుండెపై దుష్ప్రభావం పడుతుంది.