వేసవి కాలంలో ఉండే అధిక ఎండలతో చర్మానికి ఇబ్బందులు కలుగుతాయి. చర్మం మెరుపు తగ్గడం, డల్‍నెస్, మొటిమలు, మచ్చలు లాంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి.
Photo: Pexels
వేడి అధికంగా ఉండే వేసవిలో చర్మం బాగుండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఇవి ఫాలో అయితే స్కిన్ మెరుగ్గా ఉంటుంది. చర్మం కోసం ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవంటే..
Photo: Pexels
ఎండాకాలంలో విటమిన్ సీ పుష్కలంగా ఉండే ఫుడ్స్ తింటే చర్మానికి ఎంతో మేలు. కొలాజెన్ ఉత్పత్తని పెంచి చర్మం మెరుపుతో, మెరుగ్గా ఉండేలా ఈ విటమిన్ చేయగలదు. అందుకే విటమిన్ సీ ఎక్కువగా ఉండే టమాటో, నారింజ, బ్రోకలీ, బెర్రీలు, బొప్పాయి, జామ, నిమ్మ లాంటి ఫుడ్స్ వేసవిలో తీసుకోవాలి.
Photo: Pexels
వేసవి కాలంలో సన్‍స్క్రీన్ తప్పనిసరిగా వాడాలి. ముఖ్యంగా ఎండలోకి వెళుతుంటే కచ్చితంగా ఇది పూసుకోవాలి. సూర్యకిరణాల నుంచి వచ్చే వేడి వల్ల చర్మం డ్యామేజ్ అవకుండా సన్‍స్క్రీన్ సహకరిస్తుంది. డార్క్ స్పాట్స్ రాకుండా ఉపయోగపడుతుంది.
Photo: Pexels
డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోయేందుకు వేసవిలో చర్మానికి ఎక్స్‌ఫోలియేట్ చేసుకోవాలి. ఎక్స్‌ఫోలియేట్ కోసం కాఫీ, పెరుగు, యగర్ట్, చక్కెర లాంటి సహజమైన పదార్థాలు వాడాలి. కెమికల్ ప్రొడక్టులు వీలైనంత తక్కువ వినియోగించాలి.
Photo: Pexels
వేసవిలో తప్పనిసరిగా తగినంత నీరు తాగడం వల్ల చర్మం కూడా మెరుగ్గా ఉంటుంది. చర్మం పొడిగా, గరకుగా కాకుండా ఉంటుంది. శరీరంలోని వ్యర్థాలు సులువుగా బయటికి పోయేందుకు నీరు బాగా తాగడం తోడ్పడుతుంది. చర్మపు మెరుపును పెంచుతుంది. హైట్రేడెట్‍గా ఉంచుతుంది.
Photo: Pexels
ఎండాకాలంలో కూడా చర్మానికి మాయిశ్చరైజర్ రాయాలి. డ్యామేజ్ అయిన చర్మ కణాలను ఇది బాగు చేయగలదు. చర్మంలో తేమ ఆరిపోకుండా.. మెరుపుతో ఉండేందుకు తోడ్పడుతుంది.
Photo: Pexels
జంక్ ఫుడ్ ఎంత తిన్నా, ఇంకా తినాలనిపిస్తుంది! ఎందుకో తెలుసా?