ఆరోగ్యంగా ఉంటే ఏ పనైనా చేయవచ్చు. హెల్తీ ఉండేందుకు కొన్ని విత్తనాలు తీసుకోవాలి. చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

Unsplash

By Anand Sai
Nov 10, 2024

Hindustan Times
Telugu

ఆరోగ్యంగా ఉండేందుకు అవిసే గింజలు రోజూ తీసుకోవాలి. ఇందులో  కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, జింక్‌ పుష్కలంగా ఉంటాయి.

Unsplash

చియా సీడ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.  ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, మెగ్నీషియం, జింక్, ఫైబర్ దొరుకుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం కూడా ఎక్కువే.

Unsplash

పొద్దుతిరుగుడు విత్తనాలు కొవ్వులు, మాంసకృత్తులు, ఫైబర్, వివిధ ముఖ్యమైన ఖనిజాలతో ఉంటాయి. విటమిన్ ఈ కూడా ఉంటుంది.

Unsplash

గుమ్మడి గింజలు రోజూవారి ఆరోగ్యం తప్పనిసరిగా చేర్చుకోవాలి. ఐరన్, పీచు, మంచి కొవ్వులతోపాటుగా అనేక ఖనిజాలు ఉంటాయి.

Unsplash

తులసి గింజల్లో ప్రోటీన్, అవసరమైన కొవ్వులు, పిండి పదార్థాలు, ఫైబర్ ఉంటాయి. జీర్ణక్రియకు సాయపడతాయి.

Unsplash

నువ్వులతో ఎన్నో ప్రయోజనాలు పొందుతారు. ఇందులో కాల్షియం, రాగి, ఫైబర్, మెగ్నీషియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి.

Unsplash

దానిమ్మ గింజల్లో ఫైబర్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచివి.

Unsplash

జలుబు, దగ్గు కొన్ని రోజులు లేదా వారాలకు మించి ఉంటూ తలనొప్పి, ముక్కు కారుతుండడం ఉంటే, అది సైనస్ ఇన్ఫెక్షన్ కావచ్చు. చలికాలంలో జలుబు, దగ్గు, అలెర్జీల కారణంగా సైనస్ సమస్య రావొచ్చు.   

pexels