జీర్ణక్రియను మెరుగుపరిచే 5 రకాల టీలు ఇవి

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Jul 09, 2024

Hindustan Times
Telugu

శరీరం బాగుండాలంటే తిన్న ఆహారం బాగా జీర్ణమవ్వాలి. జీర్ణ సమస్య ఉంటే ఇబ్బందిగా అనిపిస్తుంది. కొన్ని రకాల టీలు జీర్ణక్రియను మెరుగుపరచగలవు. అవేంటంటే.. 

Photo: Pexels

పుదీన ఆకులతో తయారు చేసే పుదీన టీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అజీర్తి, గ్యాస్ లాంటి సమస్యను తగ్గించగలదు. 

Photo: Pexels

అల్లం టీ కూడా ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు తోడ్పడుతుంది. వాంతులు, వికారం లాంటి జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గేందుకు కూడా ఉపయోగపడుతుంది.

Photo: Pexels

సోంపుతో తయారు చేసే సోంపు టీ కూడా జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది. మంట, గ్యాస్ లాంటి ఇబ్బందులను తగ్గిస్తుంది. 

Photo: Pexels

బ్లాక్‍ టీలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. దీంతో జీర్ణం మెరుగ్గా అయ్యేందుకు ఈ టీ కూడా సహకరిస్తుంది. 

Photo: Pexels

చామంతి రేకులతో తయారు చేసే చామంతి టీ.. పేగుల కదలికను మెరుగుపరుస్తుంది. దీంతో జీర్ణశక్తిని పెంచగలదు.

Photo: Pexels

ఐఎమ్‌డీబీ రేటింగ్ ప్రకారం షారుక్ ఖాన్ టాప్ 10 సినిమాలు- నెంబర్ 1 ఇదే!