శరీరంలోని వ్యర్థమైన విషతుల్య పదార్థాలు సులువుగా బయటికి వెళ్లిపోయేందుకు (డిటాక్స్) కొన్ని డ్రింక్స్ తోడ్పడతాయి. ఇలా.. డిటాక్స్‌కు సహాయ పడే ఐదు రకాల డ్రింక్స్ ఇక్కడ చూడండి.
Photo: Unsplash
నిమ్మరసంలో విటమిన్ సీ, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది డిటాక్స్ అయ్యేందుకు తోడ్పడుతుంది. శరీరాన్ని క్లీన్ చేసేందుకు ఉపయోగపడుతుంది.
Photo: Pexels
చియాసీడ్స్ (సబ్జా గింజలు) నానబెట్టిన నీరు తాగితే పేగుల ఆరోగ్యం మెరుగవటంతో పాటు శరీరంలోని వ్యర్థాలు బయటికి వెళ్లేందుకు తోడ్పడుతుంది. ఇతర డ్రింక్‍ల్లోనూ సబ్జా గింజలు వేసుకోవచ్చు.
Photo: Pexels
కొబ్బరినీరులో యాంటీఆక్సిడెంట్లు, హైడ్రేటింగ్ గుణాలు ఉంటాయి. డిటాక్సింగ్‍కు కొబ్బరినీరు తాగడం తోడ్పడుతుంది.
Photo: Pexels
శరీరంలో మినరల్స్, ఫ్లుయిడ్స్ సమతుల్యంగా ఉండేలా కీరదోస జ్యూస్ చేయగలదు. కీరదోస జ్యూస్ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. శరీరంలో డిటాక్స్ జరిగేందుకు సహకరిస్తుంది.
Photo: Pexels
కలబంద జ్యూస్‍లో అలోయిన్, సాపోనిన్స్ ఎక్కువగా ఉంటాయి. దీంతో కలబంద జ్యూస్ తాగితే పేగుల కదలిక మెరుగ్గా ఉంటుంది. కాలేయంలోని విష వ్యర్థాలు బయటికి వెళ్లేందుకు ఈ జ్యూస్ ఉపయోగపడుతుంది.
Photo: Pexels
యవ్వనంగా ఉండేందుకు నాగార్జున పాటించే చిట్కాలు ఇవే!