పేగుల ఆరోగ్యం సరిగా లేకపోతే కనిపించే లక్షణాలు ఇవే

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Aug 24, 2024

Hindustan Times
Telugu

పేగులు నిరంతరం ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం. పేగులు శరీరంలోని చాలా భాగాలను ప్రభావితం చేయగలదు. 

Photo: Pinterest

ప్రస్తుత కాలంలో సరైన ఆహారం తినక, అధిక ఒత్తిడి, నిద్రసరిపోని కారణాలతో మైక్రోబయోమ్‍పై ప్రభావం పడుతోంది. పేగులకు ప్రతికూలంగా ఉంటోంది. పేగులు అనారోగ్యంగా ఉన్నాయనేందుకు శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవేంటంటే.. 

Photo: Pexels

కడుపులో గ్యాస్, తేపులు, మలబద్దకం, డయేరియా, ఛాతిలో మంట లాంటి సమస్యలు తరచూ వస్తుంటే పేగుల ఆరోగ్యం సరిగా లేదనేందుకు సంకేతాలుగా పరిగణించవచ్చు. 

Photo: Pexels

తీసుకున్న ఆహారానికి, వ్యాయామానికి సంబంధం లేకుండా అమాంతం బరువు పెరగడం కూడా పేగు అనారోగ్య లక్షణమే. 

Photo: Pexels

చర్మంపై దురద, పొడలు ఎక్కువగా వస్తుండడం కూడా పేగు ఆరోగ్యం సరిగా లేదని సూచిస్తుంది. పేగులకు మేలు చేసే బ్యాక్టీరియా తగ్గితే చర్మ ఆరోగ్యం, రోగనిరోధక శక్తిపై కూడా ప్రభావం పడుతుంది.

Photo: Pexels

తరచూ సరిగా నిద్రపట్టకపోవడం, నిద్రకు భంగం కలుగుతుండడానికి కూడా పేగుల ఆరోగ్యానికి సంబంధం ఉంటుంది. దీని వల్ల అలసట కూడా పెరుగుతుంది. 

Photo: Pexels

సీతాఫలం పోషకాహార పవర్‌హౌస్. వీటిలో ఫైబర్‌, మినరల్స్, విటమిన్లు వంటి అనేక పోషకాలు ఉంటాయి.  సీతాఫలంలో పీచుపదార్థాలు, యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్, విటమిన్ B6, పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. సీతాఫలం వల్ల కలిగే10  ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.  

pexels