హై బీపీ ఒక సాధారణ ఆరోగ్య సమస్య. దీనికి చికిత్స తీసుకోకపోతే తీవ్రమైన సమస్యగా మారుతుంది. ఈ 5 మూలికలు(హెర్బ్స్) అధిక రక్తపోటును సహజంగా తగ్గించడంలో సహాయపడతాయి.
pexels
By Bandaru Satyaprasad Feb 19, 2025
Hindustan Times Telugu
తులసి - తులసిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గించడానికి, రక్తపోటును నివారించడానికి సహాయపడతాయి. రక్తనాళాలలను సడలించి, రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి తులసి టీ తాగడం లేదా తులసి ఆకులను నమలవచ్చు.
pexels
వెల్లుల్లి- వెల్లుల్లిలో అల్లిసిన్ వంటి సల్పర్ సమ్మేళనాలు ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. రక్తనాళాలను సడలించి, కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి, రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి, రక్తపోటు స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది.
pexels
ఉసిరి- ఉసిరి జుట్టు, చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఉసిరిలోని విటమిన్ సి గుండె కండరాలను బలోపేతం చేయడం ద్వారా రక్త ప్రసరణను మెరుగుపరిచి, రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.
pexels
దాల్చిన చెక్క
pexels
దాల్చిన చెక్కలో రక్తనాళాల పనితీరును మెరుగుపరిచే, రక్తనాళాలను సడలించడానికి సహాయపడే సమ్మేళనాలు ఉంటాయి. ఇది సిస్టోలిక్, డయాస్టోలిక్ రక్తపోటు రెండింటినీ తగ్గించడంలో సహాయపడుతుంది. డయాబెటిస్ ఉన్నవారికి కూడా మంచిది.
pexels
అశ్వగంధ
pexels
అశ్వగంధ ఒక అడాప్టోజెన్. ఇది అధిక రక్తపోటుకు కారణమైన ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది శరీరం, మనస్సును ప్రశాంతపరచడంలో, క్రమంగా రక్తపోటు స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.
pexels
గుండె ఆరోగ్యం కోసం ఈ
డ్రై ఫ్రూట్స్ కు దూరంగా ఉండాల్సిందే