శరీరంలో ఎర్రరక్తకణాల్లో హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గితే అలసట, బలహీనత, అనేమియా సహా మరిన్ని సమస్యలు ఎదురవుతాయి. అందుకే ఇది మెరుగ్గా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. హిమోగ్లోబిన్ స్థాయిని పెంచగలగిలే ఐదు రకాల పండ్లు ఏవో ఇక్కడ చూడండి.
Photo: Pexels
దానిమ్మ పండులో విటమిన్ కే, విటమిన్ సీ, ఫైబర్, పొటాషియం, ప్రొటీన్ పుష్కలంగా ఉంటాయి. ఈ పండు తింటే హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి.
Photo: Pexels
నారింజ పండ్లలో విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. శరీరం ఐరన్‍ను సంగ్రహించేందుకు ఇది తోడ్పడి.. హిమోగ్లోబిన్ స్థాయి పెరిగేందుకు ఉపయోగపడుతుంది. విటమిన్ బీ6 కూడా హిమోగ్లోబిన్‍కు మేలు చేస్తుంది.
Photo: Pexels
యాపిల్ పండ్లలో ఫ్లేవనాయిడ్స్, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. హిమోగ్లోబిన్ శాతం అధికమయ్యేందుకు యాపిల్ తినడం చాలా ఉపయోగపడుతుంది.
Photo: Pexels
పుచ్చకాయల్లో వాటర్ కంటెంట్, విటమిన్ సీ అధికంగా ఉంటాయి. ఎర్రరక్తకణాలకు ఇవి చాలా మేలు చేస్తాయి. ఈ పండులో ఎక్కువగా ఉండే ఐరన్.. హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచగలవు.
Photo: Pexels
స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీలు సహా ఇతర బెర్రీల్లో విటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్లు, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. ఇవి తీసుకున్నా హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరిగేందుకు సహకరిస్తాయి.
Photo: Pexels
బరువు తగ్గాలనుకుంటే డైట్‍లో ఈ వెజిటేరియన్ ఫుడ్స్ తీసుకోండి!