శరీరానికి ఎంతో ముఖ్యమైన పోషకం 'పొటాషియం' అరటిపండ్లలో ఎక్కువగా ఉంటుంది. పొటాషియం ఫుడ్‍గా అరటి బాగా పేరు తెచ్చుకుంది. అయితే, అరటి పండ్లలో కంటే కొన్నింట్లో పొటాషియం మరింత ఎక్కువగా ఉంటుంది. అలాంటి 5 ఫుడ్స్ ఏవో ఇక్కడ చూడండి.
Photo: Pexels
చిలగడదుంపల్లో పొటాషియం అధికంగా ఉంటుంది. వీటిని తింటే ప్రొటీన్, ఫైబర్, విటమిన్ ఏ కూడా పుష్కలంగా దక్కుతాయి
Photo: Pexels
పాలకూరలోనూ పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఫోలెట్, మెగ్నిషియం, విటమిన్ ఏ, కే కూడా వీటిలో ఉంటుంది.
Photo: Pexels
అవకాడోలు తిన్నా శరీరానికి పొటాషియం ఎక్కువగా అందుతుంది. విటమిన్ కే, ఫోలెట్ కూడా వీటి ద్వారా లభిస్తాయి.
Photo: Pexels
బీన్స్, కాయధాన్యాల్లో పొటాషియం మెండుగా ఉంటుంది. వీటిని తినడం వల్ల మరిన్ని పోషకాలు కూడా శరీరానికి అందుతాయి.
Photo: Pexels
బంగాళదుంపల్లోనూ పొటాషియం అధిక మోతాదులోనే ఉంటుంది. వీటిని తింటే ఐరన్, జింక్, విటమిన్ బీ6 సహా మరిన్ని పోషకాలు దక్కుతాయి.