తీపి పదార్థాలు ఎక్కువగా తినాలనిపిస్తోందా? ఆ ఆశ తగ్గేందుకు ఇవి తీసుకోండి

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Oct 30, 2024

Hindustan Times
Telugu

కొందరికి తీపి పదార్థాలు ఎక్కువగా తినాలని మనసు లాగేస్తుంది. అయితే స్వీట్ మరీ అతిగా తింటే ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అయినా ఎక్కువగా తినేస్తుంటారు. అయితే, తీపి ఎక్కువగా తినాలనే కోరికను (స్వీట్ క్రేవింగ్స్) తగ్గించగిలిగే ఐదు ఆహారాలు ఇక్కడ చూడండి. 

Photo: Pexels

ఓట్స్‌లో సోలబుల్ ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండిన ఫీలింగ్ ఇస్తుంది. శరీరంలో గ్లూజోక్ లెవెల్స్ తగ్గిస్తుంది. ఓట్స్ తింటే తీపి ఎక్కువగా తినాలనే కోరిక తగ్గుతుంది. 

Photo: Pexels

అరటిలో మెగ్నిషియం పుష్కలంగా ఉంటుంది. ఇది తినడం వల్ల తీపి పదార్థాలు తీసుకోవాలనే తపన తగ్గుతుంది. 

Photo: Pexels

దాల్చిన చెక్కను తీసుకోవడం వల్ల షుగర్ క్రేవింగ్స్ తగ్గుతాయి. ఇందులోని సినామల్డెహైడ్.. ఇన్సులిన్ సిగ్నలింగ్‍ను మెరుగుపరచడం వల్ల ఇలా జరుగుతుంది.

Photo: Pexels

స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు లాంటి బెర్రీల్లో నేచురల్ స్వీట్ ఉంటుంది. ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి తింటే తీపి పదార్థాలు తినాలనే కోరిక తగ్గుతుంది. 

Photo: Pexels

గుమ్మడి గింజల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇవి తింటే కడుపు నిండిన ఫీలింగ్ ఇస్తాయి. స్వీట్ తినాలనే తపనను తగ్గించగలవు. 

Photo: Unsplash

చలికాలంలో నెయ్యి తినండి - ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు

image source unsplash.com