జుట్టు ఒత్తుగా పెరిగేందుకు తోడ్పడే ఐదు పండ్లు

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Jun 26, 2024

Hindustan Times
Telugu

జుట్టు ఆరోగ్యంలో పండ్లు కూడా ఎంతో కీలకపాత్ర పోషిస్తాయి. వాటిలో ఉండే విటమిన్లు, మినరల్స్ చాలా మేలు చేస్తాయి. అలా.. జుట్టు ఒత్తుగా పెరిగేందుకు తోడ్పడే ఐదు రకాల పండ్లు ఏవో ఇక్కడ చూడండి.

Photo: Pexels

స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, రాస్ప్ బెర్రీలు లాంటి బెర్రీల్లో యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి జుట్టు ఫాలిసిల్స్‌ను ఆక్సిడేవిట్ డ్యామేజ్ నుంచి కాపాడుతాయి.జుట్టు ఒత్తుగా పెరిగేందుకు సహకరిస్తాయి. 

Photo: Pexels

అరటి పండ్లలో పొటాషియమ్, విటమిన్లు, నేరురల్ ఆయిల్స్ ఉంటాయి. జుట్టు రాలడాన్ని ఇవి తగ్గించగలవు. అలాగే, ఒత్తుగా ఉండేందుకు తోడ్పడతాయి. 

Photo: Pexels

అవకాడోల్లో విటమిన్ ఈ, హెల్దీ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి తింటే రస్తప్రసరణ బాగా జరుగుతుంది. జుట్టు పెరిగేందుకు చాలా మేలు చేస్తుంది. 

Photo: Pexels

నారింజ, నిమ్మ, గ్రేప్‍ఫ్రూట్ లాంటి సిట్రస్ పండ్లలో సిట్రిక్ యాసిడ్, విటమిన్ సీ ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టు ఒత్తుగా పెరిగేందుకు తోడ్పడతాయి. 

Photo: Pexels

బొప్పాయి పండ్లలో విటమిన్ ఏ,సీ,ఈతో పాటు ఎంజైమ్‍లు కూడా ఉంటాయి. జుట్టు పెరుగుదలకు ఈ పండు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. 

Photo: Pexels

ఖాళీ పొట్టతో ఒక వెల్లుల్లి రెబ్బ తింటే ఏమవుతుంది?

pixabay