జుట్టు మెరుపును, దృఢత్వాన్ని పెంచగలిగే ఐదు రకాల ఫుడ్స్ ఇవి
Photo: Pexels
By Chatakonda Krishna Prakash Aug 03, 2024
Hindustan Times Telugu
జుట్టు ఆరోగ్యంలో మనం తినే ఆహారం చాలా కీలకంగా ఉంటుంది. జుట్టు మెరుపు ఎక్కువగా, దృఢంగా ఉండేందుకు కొన్ని ఫుడ్స్ తోడ్పడతాయి. అందుకు తోడ్పడే ఐదు రకాల ఆహారాలు ఏవో ఇక్కడ చూడండి.
Photo: Pexels
కోడిగుడ్లలో బయోటిన్, ప్రొటీన్స్ ఎక్కువగా ఉంటాయి. జుట్టులో తేమను కాపాడి మెరుపు ఉండేలా గుడ్లు చేయగలవు. వెంట్రుకలు ఒత్తుగా, బలంగా ఉండేందుకు సహకరిస్తాయి.
Photo: Pexels
బాదం, ఆక్రోటు లాంటి నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్, మెగ్నిషియం, విటమిన్-ఈ, ఫైబర్ లాంటి పోషకాలు ఉంటాయి. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. వెంట్రుకల దృఢత్వాన్ని మెరుగుపరుస్తాయి.
Photo: Pexels
ఉసిరికాయల్లో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‍ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉంటాయి. ఇవి తింటే జుట్టు పొడిబారడం తగ్గుతుంది. డాన్‍డ్రఫ్, చిక్కులు కూడా తగ్గేందుకు ఉసిరి తోడ్పడుతుంది.
Photo: Pexels
పాలకూరలో విటమిన్ సీ, ఏ, ఫోలెట్, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టులో తేమను కాపాడుతాయి. జట్టు రాలడాన్ని కూడా పాలకూర తగ్గించగలదు.
Photo: Pexels
అవిసె గింజలు, చియా విత్తనాల్లో విటమిన్ బీ6, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్, జింక్, ఐరన్ మెండుగా ఉంటాయి. ఈ విత్తనాలు ఆహారంలో తీసుకోవడం వల్ల జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి.
Photo: Pexels
బరువు తగ్గాలనుకుంటే డైట్‍లో ఈ వెజిటేరియన్ ఫుడ్స్ తీసుకోండి!