అనారోగ్యం నుంచి కోలుకునేందుకు తోడ్పడే 5 రకాల ఆహారాలు ఇవి

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
May 20, 2024

Hindustan Times
Telugu

రోగాల బారిన పడినప్పుడు లేకపోతే గాయాలు అయినప్పుడు కోలుకునేందుకు మందులతో పాటు తీసుకునే ఆహారం కూడా చాలా ముఖ్యం. మీ శరీరం కోలుకునేందుకు తోడ్పడే ముఖ్యమైన ఆహారాలు ఏవో ఇక్కడ చూడండి. 

Photo: Pexels

పాలకూర, బచ్చలికూర, కేల్, స్విస్ చార్డ్ లాంటి ఆకుకూరల్లో విటమిన్ కే, విటమిన్ సీ, ఫోలెట్, మ్యాగ్నీస్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధకశక్తిని పెంచటంతో పాటు మంటను తగ్గిస్తాయి. కోలుకునేందుకు తోడ్పడతాయి. 

Photo: Pexels

బాదం, ఆక్రోటు, జీడిపప్పు, పొద్దుతిరుగుడు విత్తనాలు లాంటి నట్స్, గింజల్లో ప్రోటీన్, ఆరోగ్యకరమైన ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. శరీరం రికవర్ అయ్యేందుకు ఉపయోగపడతాయి. 

Photo: Pexels

స్ట్రాబెర్రీలు, రాస్ప్ బెర్రీలు, బ్లూబెర్రీల్లాంటి బెర్రీల్లో విటమిన్ సీ, ఆంథోసియానైనిన్స్, కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. శరీరానికి మంచి ఎనర్జీని ఇవి అందిస్తాయి. 

Photo: Pexels

సాల్మోన్ చేపలో విటమిన్ బీ, ఐరన్, జింక్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వీటివల్ల మంట తగ్గుతుంది. రోగనిరోధక శక్తి పెరిగి కోలుకునేందుకు తోడ్పడుతుంది. కోడిగుడ్లు కూడా రికవరీ అయ్యేందుకు చాలా ఉపయోగపడతాయి.  

Photo: Pexels

చిలగడదుంపల్లో అవసరమైన పోషకాలు, కార్బొహైడ్రేట్స్ మెండుగా ఉంటాయి. అందుకే కణాలు రికవర్ అయ్యేందుకు ఇవి చాలా సహకరిస్తాయి.  

Photo: Pexels

అందాలతో కాకా రేపుతోన్న కల్కి 2898 ఏడీ హీరోయిన్ దిశా పటానీ

Instagram