క్యాల్షియం తక్కువగా ఉందా..? అయితే రాగులు తీసుకోవాల్సిందే

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Jan 09, 2025

Hindustan Times
Telugu

ఎముక పుష్టికి కావాల్సిన పోషకాలు చాలా ఆహారాల్లో ఉంటాయి. అయితే రాగులతో అద్భుతమైన ప్రయోజనాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు.

image credit to unsplash

రాగుల్లో  ఐరన్, అమైనో యాసిడ్లు, ఫైబర్‌ అధికంగా ఉంటాయి. సమతులాహారాన్ని తినాలనుకునే వాళ్లూ వీటిని ఎంచుకోవచ్చు. వీటితో మంచి ఆరోగ్య ఫలితాలు అందుతాయి.

image credit to unsplash

రాగులను క్రమంగా తీసుకుంటే ఎముకల్లో పటుత్వం పెరుగుతుంది. బియ్యం, గోధుమలతో పోలిస్తే రాగుల్లో ఫైబర్‌‌ కంటెంట్‌‌ ఎక్కువ ఉంటుంది. ర

image credit to unsplash

రాగుల్లో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ స్థాయులు తక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రించడానికి సహాయపడతాయి.

image credit to unsplash

రాగి పిండిలో అత్యధిక మొత్తంలో క్యాల్షియంతో పాటు భాస్వరం ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన ఎముకలు, దంతాల అభివృద్ధికి సహాయపడుతుంది.

image credit to unsplash

రాగులు  సహజ ఇనుముకు గొప్ప మూలం. రక్తహీనత ఉన్నవారికి, తక్కువ హిమోగ్లోబిన్ స్థాయిలు ఉన్నవారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. రక్తప్రవాహంలోకి ఇనుము శోషణను సులభతరం చేస్తుంది. 

image credit to unsplash

రాగులు మాత్రమే కాకుండా... సజ్జలు,గోధుమ పిండి, కంది పప్పు, మినప పప్పు, పెసర పప్పు, ఉలవలు, అవిసి కూర వంటి వాటిల్లో క్యాల్షియం లభిస్తుంది.

image credit to unsplash

వాకింగ్ చేస్తే బరువు తగ్గుతారా? ముఖ్యంగా పొట్ట తగ్గుతుందా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. వాకింగ్ వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గడంతో పాటు అనేక ఆర్యోగ ప్రయోజనాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.  

pexels