ఫైబర్ అనేది ఎవరికైనా ముఖ్యమే. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం రోజూ తీసుకోవాల్సిందే. మరి ఈ ఫైబర్ ఎక్కువగా ఉండే 7 రకాల పండ్లు, కూరగాయలు ఏవో చూడండి.

pexels

By Hari Prasad S
Feb 13, 2025

Hindustan Times
Telugu

ఉడకబెట్టిన ఒక కప్పు పచ్చి బఠానీల్లో 9 గ్రాముల వరకు ఫైబర్ ఉంటుంది. ఫైబర్ కోసం చూసే వారికి ఇది మంచి ఆహారం

pexels

ఉడకబెట్టిన కప్పు బ్రోకోలీలో 5 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇది అన్ని రకాలుగా ఆరోగ్యానికి మంచిది

pexels

తొక్కతో కూడిన బంగాళాదుంప లేదా ఆలుగడ్డ కాల్చి తింటే అందులో 4 గ్రాముల ఫైబర్ దక్కుతుంది

pexels

స్వీట్ కార్న్‌ను ఉడకబెట్టి తింటే శరీరానికి 4 గ్రాముల ఫైబర్ అందుతుందని గమనించండి

pexels

క్యారెట్లలోనూ 1.5 గ్రాముల ఫైబర్ ఉంటుంది. దీనిని వండకుండా అలాగే తినడం మంచిది

pexels

నేరేడు రకానికి చెందిన పియ్ పండ్లలో 5.5 గ్రాముల ఫైబర్ ఉంటుంది. వీటిని రెగ్యులర్ తినండి

pexels

ఆపిల్‌ను అలాగే తొక్కతో తినడం మంచిది. ఇలా తింటే శరీరానికి 4.5 గ్రాముల ఫైబర్ అందుతుంది

pexels

బైక్ నడిపేవారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి.. 8 ముఖ్యమైన అంశాలు

Image Source From unsplash