జ్వరం తగ్గినా రోజుల తరబడి ఒంటి నొప్పులు తగ్గడం లేదా... అవి చికున్ గున్యా లక్షణాలే...

By Sarath Chandra.B
Apr 17, 2025

Hindustan Times
Telugu

రోజుల తరబడి ఒంటి నొప్పులు తగ్గకుండా ఉండటం చికున్‌ గున్యా ముఖ్య లక్షణాల్లో ఒకటి...

చికున్‌ గున్యాకు చికెన్‌ కు ఏ మాత్రం సంబంధం లేదు. 1952లో మొదటి సారి ఆఫ్రికాలోని టాంజానియా, మొజాంబిక్‌ దేశాల సరిహద్దుల్లో ఉన్న మెకొంటే ప్రాంతంలో చికున్ గున్యాను గుర్తించారు. 

చికున్ గున్యాలో కీళ్ల నొప్పులతో ముందుకు ఒంగిపోతారు.  అందుకే ఈ పేరు వచ్చింది. 

తూర్పు, దక్షిణాసియా దేశాల్లో, ఆఫ్రికా దేశాల్లో చికున్ గున్యా ఎక్కువగా కనిపిస్తుంది. 

డెంగ్యూ మాదిరే చికున్ గున్యా కూడా దోమల కారణంగా వస్తుంది. ఇది ఒక ఆల్ఫా వైరస్‌ లేదా 1వ గ్రూప్‌ ఆర్బో  వైరస్‌ వలన వస్తుంది. 

ఆల్ఫా వైరస్‌ సోకిన దోమలు మనిషిని కుడితే ఈ రోగం వస్తుంది. ఈ దోమల్ని ఏడిస్‌ ఈజిప్టె అంటారు. 

చికున్‌ గున్యాకు కారణమయ్యే దోమలు పగలే కుడతాయి. 

చికున్‌ గున్యాలో జ్వరం, చలి, వికారం, వాంతులు, తలనొప్పి, కీళ్ల నొప్పులు,  దద్దుర్లు వంటి లక్షణాలు ఉంటాయి.  అన్ని లేదా కొన్ని లక్షణాలు ఉంటాయి. 

చికున్ గున్యాలో ప్రధానంగా కీళ్ల నొప్పులు ప్రధానంగా కనిపిస్తాయి. దీంతోనే ఈ సమస్యను ప్రధానంగా గుర్తించవచ్చు. దోమ కుట్టిన 1-12 రోజులకు ఈ లక్షణాలు కనిపిస్తాయి. 

దద్దుర్లతో పాటు  కళ్లు ఎర్రగా మారడం,  వెలుతురు చూడలేకపోవడం వంటి సమస్యలు ఉంటాయి. 

ఎలీసా పరీక్షల ద్వారా చికున్ గున్యాను గుర్తించవచ్చు. ఎలీసా పరీక్ష నిర్ధారణ  ఖర్చుతో కూడుకున్నది కావడంతో వ్యాధి నిర్ధారణలో జాప్యం జరుగుతోంది. 

ఎలీసా పరీక్ష అందుబాటులో లేకపోయినా తీవ్రమైన  కీళ్ల నొప్పులు ఉంటే దానిని చికున్ గున్యాగా గుర్తించవచ్చు. 

చికున్‌ గున్యాను తెచ్చిపెట్టే వైరస్‌ను చంపేందుకు  సరైన మందులు లేవు. ఇతర వైరస్‌ జబ్బుల మాదిరే చికున్‌ గున్యా వైరస్‌ను శరీరంలో రోగ నిరోధక శక్తి ఎదుర్కొంటుంది. 

రెండు వారాల నుంచి  మూడు నెలల వరకు ఈ నొప్పులు కొనసాగుతాయి. ఈ తర్వాత తగ్గుముఖం పడతాయి. 

అధిక యూరిక్ యాసిడ్ ఇటీవలి కాలంలో ఒక సాధారణ పరిస్థితి. కొన్నిసార్లు అది పెరిగితే ఇంటి నివారణలు లేదా చికిత్స అవసరం కావచ్చు.

Unsplash