పునరుత్పత్తికి పురుషుల స్పెర్మ్ కౌంట్, నాణ్యత కీలకం. పిల్లల కోసం ప్రయత్నించేటప్పుడు ముఖ్యంగా పురుషులు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. అవేంటో తెలుసుకుందాం.
pexels
By Bandaru Satyaprasad Jan 27, 2025
Hindustan Times Telugu
సోయా ఉత్పత్తులు- సోయాలో ఐసోఫ్లేవోన్స్ ఉంటాయి. సోయా ఉత్పత్తులు అధిక వినియోగం పురుషులలో హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. తద్వారా స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. ఇది సంతానోత్పత్తికి ఆటంకం కలిగిస్తుంది.
pexels
ప్రాసెస్డ్ మీట్, ఫాస్ట్ ఫుడ్స్ -ప్రాసెస్ చేసిన ఆహారం, ఫాస్ట్ ఫుడ్స్ లో అధిక స్థాయిలో ట్రాన్స్ ఫ్యాట్స్, ప్రిజర్వేటివ్‌లు, అధిక సోడియం ఉంటాయి. ఇవి స్పెర్మ్ నాణ్యతకు, బలహీనమైన చలనానికి దారితీస్తాయి. స్పెర్మ్ ఉత్పత్తిపై ప్రభావం చూపుతాయి.
pexels
కూల్ డ్రింక్స్- శీతల పానీయాలు కృత్రిమ స్వీటెనర్లను కలిగి ఉంటాయి. ఇవి స్పెర్మ్ నాణ్యతకు హానికరం. ఈ డ్రింక్స్ రెగ్యులర్ గా వినియోగిస్తే ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తుంది. ఇది స్పెర్మ్ కౌంట్ ను దెబ్బతీస్తుంది.
pexels
హై మెర్క్యూరీ చేపలు- స్వార్డ్ ఫిష్, ట్యూనా వంటి చేపల్లో పాదరసం ఉంటుంది. ఇది స్పెర్మ్ డీఎన్ఏను దెబ్బతీయడంతో పాటు స్పెర్మ్ మొబిలిటీపై ప్రభావం చూపుతుంది. అధిక పాదరసం ఉండే చేపలను పరిమితం చేయడంతో స్పెర్మ్ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
pexels
మితిమీరిన మద్యం - దీర్ఘకాలికంగా ఆల్కహాల్ వినియోగం స్పెర్మ్ ఉత్పత్తికి అంతరాయం కలిగిస్తుంది. స్పెర్మ్ వాల్యూమ్, మొబిలిటీ తగ్గడానికి దారితీస్తాయి. స్పెర్మ్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మద్యపానాన్ని తగ్గించాలి.
pexels
అధిక కొవ్వు గల పాల ఉత్పత్తులు- ఫ్యాట్ ఎక్కువగా ఉండే పాల ఉత్పత్తులు, కొన్ని చీజ్‌లు టెస్టోస్టెరాన్ స్థాయిలను తగ్గిస్తాయి. సంతృప్త కొవ్వు హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. స్పెర్మ్ కౌంట్ తగ్గి పునరుత్పత్తి ఆరోగ్యానికి ప్రతికూలంగా మారుతుంది.
pexels
కెఫిన్ - అధిక కెఫిన్ స్పెర్మ్ కౌంట్, స్పెర్మ్ డీఎన్ఏపై ప్రభావం చూపుతుంది. సంతానోత్పత్తికి ప్రయత్నిస్తున్న పురుషులు కాఫీ, ఇతర కెఫిన్ పానీయాలను తగ్గించాలి.
pexels
పిల్లల కోసం ప్రయత్నిస్తున్న పురుషులు ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి. హానికరమైన ఆహారాలను నివారించడం, ఆల్కహాల్, కెఫిన్, ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తగ్గించడంతో పాటు పోషకాహారం తీసుకుంటే స్పెర్మ్ ఆరోగ్యం, కౌంట్ ను పెంచుతుంది. పునరుత్పత్తి అవకాశాలను మెరుగుపరుస్తుంది.
pexels
బెండకాయ నీటిని తాగడం వల్ల డయాబెటిస్ నుంచి బరువు తగ్గడం వరకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి