ఉదయం లేవగానే ఒళ్లంతా నొప్పులుగా ఉంటుందా?.. ఇలా చేయండి!

By Sudarshan V
Mar 21, 2025

Hindustan Times
Telugu

ఒళ్లు నొప్పులతో నిద్రలేవడం వల్ల రోజంతా ఇబ్బందిగా, అనీజీగా ఉంటుంది.

చాలా మందికి నిద్రలేవగానే కండరాలు పట్టేసినట్లుగా ఉంటుంది.

రాత్రంతా ఒకే భంగిమలో పడుకుంటే కూడా ఉదయం లేవగానే ఒళ్లు నొప్పులు ఉంటాయి.

నాణ్యత లేని పరుపులు లేదా చాలా మృదువైన పరుపులు వాడడం వల్ల కూడా ఒళ్లు నొప్పులు వస్తాయి.

కఠినమైన వ్యాయామం లేదా భారీ బరువులు ఎత్తడం వల్ల మర్నాడు ఉదయం ఒళ్లు నొప్పులుగా ఉంటుంది.

ఉదయమే ఒళ్లు నొప్పులు ఉండకూడదనుకుంటే ఇవి చేయండి..

పడుకునే ముందు కాసేపు నడవండి.

నిద్రించే ముందు వేడి నీటితో స్నానం చేయండి.

సరైన, నాణ్యమైన పరుపులను వాడండి.

నిద్ర భంగిమలను మార్చండి

సరిగ్గా నిద్ర పోవడం లేదా? ఈ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.. జాగ్రత్త