లైంగిక సంపర్కానికి వీలుగా అంగం గట్టిపడకపోవడాన్ని అంగస్తంభన లోపం లేదా ఎరక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటారు. 

By HT Telugu Desk
Jan 24, 2025

Hindustan Times
Telugu

సమస్య నిరంతరం ఉంటే అంగస్తంభన లోపానికి తగిన వైద్య సలహా అవసరం. 

Pixabay

గుండె జబ్బులు, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, మధుమేహం, రక్తనాళాల సమస్యలు ఇందుకు కారణమవుతాయి.

Pixabay

హార్మోన్ల అసమతుల్యత, నరాల సంబంధిత రుగ్మతలు, వెన్నుపూస గాయాలు కూడా ఇందుకు కారణమవుతాయి.

Pixabay

కొన్ని రకాల మందులు, శస్త్రచికిత్సలు, రేడియేషన్ థెరపీ, ధూమపానం, మద్యపానం కూడా అంగస్తంభన లోపానికి కారణమవుతాయి.

Pixabay

ఒత్తిడి, ఆందోళన, నిరాశ, పనితీరుపై ఆందోళన, ఆత్మగౌరవం లోపించడం వంటివి కూడా అంగస్తంభనకు కారణమవుతాయి.

Pixabay

జీవనశైలి మార్పుల ద్వారా హార్మోన్ల సమతుల్యతను పెంచవచ్చు. ఆహారం, వ్యాయామం, బరువు విషయంలో శ్రద్ధ పెట్టాలి. 

Pixabay

ధూమపానం, మద్యానికి దూరంగా ఉండాలి. యోగా, ధ్యానం, శ్వాస వ్యాయామాలు చేయాలి.

Pixabay

పెల్విక్ ఫ్లోర్ వ్యాయామాలు అంగస్తంభనలో పాల్గొనే కండరాలను బలోపేతం చేస్తాయి.

Pixabay

సరిగ్గా చేయగలనా అన్న ఆందోళనను వీడాలి. మానసిక ఆరోగ్య సమస్యలు ఉంటే చికిత్సకు వెనుకాడవద్దు.

Pixabay

సమస్య తీవ్రమైతే వైద్య సలహా ద్వారా  పురుషాంగానికి రక్త ప్రసరణను పెంచే మందులు వాడొచ్చు. ఆయుర్వేద పరిష్కారాలు కూడా ఎంచుకోవచ్చు.

Pixabay

ఈ సమాచారం సాధారణ జ్ఞానం కోసం మాత్రమే. వైద్య సలహా కాదు.  అంగస్తంభన లోపం నిర్ధారణ, చికిత్స కోసం ఆరోగ్య సంరక్షణ నిపుణులను సంప్రదించండి.

Pixabay

మఖానాతో 5 నోరూరించే హెల్తీ స్నాక్స్ రెసిపీస్

pexels