పండ్లు నేరుగా తినడం మంచిదా.. జ్యూస్ మేలా?

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Jan 12, 2025

Hindustan Times
Telugu

పండ్లు నేరుగా తినడం, జ్యూస్ చేసుకొని తాగడం.. రెండింట్లో ఏది మంచిది అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అయితే, జ్యూస్ కంటే పండ్లు తినడం వల్లే కాస్త ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. అవేంటో ఇక్కడ తెలుసుకోండి. 

Photo: Pexels

పండ్ల జ్యూస్‍ల్లో సాధారణంగా ఎక్కువ క్యాలరీలు, షుగర్ ఉంటాయి. అదే పండును నేరుగా తింటే క్యాలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు జ్యూస్ కాకుండా ఫ్రూట్స్ నేరుగా తినడం మంచిది. 

Photo: Pexels

పండ్లను నేరుగా తింటే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. పండ్ల పల్ప్, తొక్కలోనూ పోషకాలు ఉంటాయి. అదే జ్యూస్ చేసుకొని తాగితే ఫైబర్ తక్కువ అవుతుంది. జీర్ణక్రియకు ఫైబర్ ఉపయోగపడుతుంది. అందుకే పండుగానే తినడం జీర్ణానికి కూడా మేలు. 

Photo: Pexels

పండ్ల రసాల్లో ఉండే షుగర్స్ వల్ల దంతాల ఎనామెల్‍కు హాని జరుగుతుంది. క్రిముల రిస్క్ పెరిగే అవకాశం ఉంటుంది. పండును నేరుగా తినడం వల్ల ఈ సమస్య ఉండదు. పండుగా తింటే సలీవా ఉత్పత్తిని పెంచి.. నోరు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచగలవు. 

Photo: Pexels

పండ్లను నేరుగా తింటే శరీరానికి వాటిలో ఉండే విటమిన్స్, మినరల్స్ సహా మిగిలిన పోషకాలు మెరుగ్గా అందుతాయి. జ్యూస్ చేయడం వల్ల పోషక విలువలు కాస్త తగ్గుతాయి. 

Photo: Pexels

పండ్లలో నేచురల్ షుగర్‌తో పాటు ఫైబర్ మెండుగా ఉంటుంది. దీంతో ఇవి తింటే శరీరంలో షుగర్ శోషణ నెమ్మదిగా ఉంటుంది. అయితే, జ్యూస్ చేసుకొని తాగడం వల్ల బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్స్ సడెన్‍గా పెరిగే ఛాన్స్ ఉంటుంది. అందుకే డయాబెటిస్ ఉన్న వారికి జ్యూస్ కంటే నేరుగా పండ్లు తినడం మంచిది.

Photo: Pexels

పండ్లు, జ్యూస్ రెండూ ఆరోగ్యమే. కానీ, జ్యూస్‍గా కంటే పండ్లను నేరుగా తినడం ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది. ఒకవేళ జ్యూస్ తాగాలనుకుంటే దాంట్లో షుగర్స్ ఎక్కువగా యాడ్ చేయొద్దు. ఫైబర్ ఎక్కువగా పోకుండా జాగ్రత్త పడాలి. 

Photo: Pexels

ఎగ్జామ్స్ రోజుల్లో మంచి, నాణ్యమైన నిద్రకు ఈ చిట్కాలు పాటించాలంటున్న సర్రే విశ్వవిద్యాలయం

Photo Credit: Unsplash