వర్కవుట్స్‌కు ముందు వీటిని తింటే ఎంతో శక్తి

pixabay

By Haritha Chappa
Jul 30, 2024

Hindustan Times
Telugu

ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ వ్యాయామాలు చేస్తూ ఉంటారు. వర్కవుట్స్ కు ముందు కొన్ని ఆహారాలు తింటే వారికి నీరసం రాకుండా ఉంటుంది. ఎక్కువ సమయం వ్యాయామం చేయచ్చు కూడా.

pixabay

కార్బోహైడ్రేట్లు, పొటాషియం అధికంగా ఉండే అరటిపండును తినడం వల్ల శరీరానికి శక్తి అందుతుంది.

pixabay

ఓట్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఓట్స్ ను వ్యాయామానికి ముందు తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.

pixabay

మామిడి, బెర్రీలు, పైనాపిల్, పెరుగు వంటివి కలిపి పండ్ల స్మూతీలు చేసి తింటే ఎంతో మంచిది. 

pixabay

నట్స్, సీడ్స్ వంటివాటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. వ్యాయామానికి ముందు వీటిని తింటే మంచిది. 

pixabay

ఒక ఎనర్జీ బార్ ను తినడం వల్ల ఎక్కువ సేపు వర్కవుట్స్ చేయవచ్చు.

pixabay

కప్పు పెరుగులో కొవ్వు తక్కువగా, ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది శక్తి స్థాయిలు పడిపోకుండా కాపాడుతుంది. 

pixabay

వర్కవుట్స్ కు ముందు ఏ ఆహారం తినకుండా చేస్తే బరువు త్వరగా తగ్గచ్చు అనుకుంటారు, కానీ ఖాళీ పొట్టతో చేస్తే నీరసం పెరిగిపోతుంది. 

pixabay

క్యాబ్​లో ప్రయాణించే మహిళలూ.. ఈ సేఫ్టీ టిప్స్​ని మర్చిపోకండి!

pexels