నాన్ వెజ్ ఫుడ్ ప్రోటీన్, విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలకు మూలం. పౌల్ట్రీ, చేపలు, లీన్ మీట్ వంటి వివిధ రకాల మాంసాహార పదార్థాలను మన డైట్ లో చేర్చుకోవడం ముఖ్యం. 

pexels

By Bandaru Satyaprasad
Jan 23, 2025

Hindustan Times
Telugu

 వ్యక్తిగత ప్రాధాన్యత, ఆహార లక్ష్యాల ఆధారంగా నాన్ వెజ్ తీసుకునే ఫ్రీక్వెన్సీ ఉంటుంది. వైద్యులు, ఆరోగ్య నిపుణులు వారానికి 2-3 సార్లు మాంసాహార ప్రోటీన్ తీసుకోవాలని సూచిస్తు్న్నారు. 

pexels

 నాన్ వెజ్ ఆహారాల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఐరన్, విటమిన్ బి12, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలకు నాన్ వెజ్ ఆహారాలు మూలం. మితంగా ఈ పోషక ఆహారాలు తీసుకోవడం అవసరం. 

pexels

క్యాన్సర్ ప్రమాదం- కొన్ని అధ్యయనాల ప్రకారం సాసేజ్, బేకన్ వంటి ప్రాసెస్ చేసిన మాంసాలను అధికంగా తీసుకోవడం వల్ల కొన్ని క్యాన్సర్లు ముఖ్యంగా కొలొరెక్టల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. 

pexels

జీర్ణ సమస్యలు - రెడ్ మీట్ అధికంగా తీసుకోవడం వల్ల అజీర్ణం, ఉబ్బరం, మలబద్దకం వంటి జీర్ణ సమస్యలకు దారితీయవచ్చు. 

pexels

రెడ్ మీట్, ప్రాసెస్ మీట్ , వేయించిన నాన్ వెజ్ ఆహారాలలో కొవ్వులు అధికంగా ఉంటాయి. వీటితో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. వీటి స్థానంలో పౌల్ట్రీ, చేపల వంటి లీన్ ప్రోటీన్లను ఎంచుకోండి.  

pexels

ప్రాసెస్ మీట్..  సంతృప్త కొవ్వులు, సోడియం, నైట్రేట్ల వంటి  ప్రిజర్వేటివ్‌లతో నిండి ఉంటుంది. ఇవి జీర్ణవ్యవస్థకు ఇబ్బందిని కలిగిస్తాయి. ప్రాసెస్ మీట్ ఆహారాలు జీర్ణం కావడానికి 3-4 గంటలు పడుతుంది.  

pexels

వారానికి మూడు రోజుల కంటే ఎక్కువ... స్పైసీ నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవడం వల్ల పలు అనారోగ్య సమస్యలు వస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఊబకాయం , క్యానర్స్, టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. 

pexels

లైంగిక ఆరోగ్యం అనేది కూడా మీ మానసిక, శారీరక ఆరోగ్యంలాంటిదే. చాలా కాలంపాటు దానిని నిర్లక్ష్యం చేస్తే కొన్ని అనారోగ్య సమస్యలు తప్పవు

pexels