రాత్రిపూట మటన్ తింటున్నారా.. అయితే ఈ సమస్యలు రావొచ్చు!

Image Source From unsplash

By Basani Shiva Kumar
Feb 09, 2025

Hindustan Times
Telugu

మటన్ జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. రాత్రిపూట జీర్ణ వ్యవస్థ నెమ్మదిగా పనిచేస్తుంది. కాబట్టి మటన్ తింటే కడుపులో అసౌకర్యం, ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి.

Image Source From unsplash

మటన్ జీర్ణం కావడానికి ఎక్కువ శక్తి అవసరం. దీనివల్ల నిద్రకు అంతరాయం కలుగుతుంది. ప్రశాంతంగా నిద్ర పట్టకపోతే మరుసటి రోజు నీరసంగా అనిపిస్తుంది.

Image Source From unsplash

మటన్‌లో కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. రాత్రిపూట శారీరక శ్రమ తక్కువగా ఉండటం వల్ల.. ఈ కొవ్వులు శరీరంలో పేరుకుపోయి బరువు పెరగడానికి దారితీస్తాయి.

Image Source From unsplash

మటన్‌లో కొలెస్ట్రాల్ కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.

Image Source From unsplash

మటన్‌లో సోడియం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును పెంచడానికి కారణమవుతుంది.

Image Source From unsplash

మటన్ ఎక్కువగా తినడం వల్ల డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

Image Source From unsplash

కొన్ని అధ్యయనాల ప్రకారం.. మటన్ ఎక్కువగా తినడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది.

Image Source From unsplash

మటన్ ఎక్కువగా తినడం వల్ల కీళ్ల నొప్పులు, గౌట్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి.

Image Source From unsplash

ఏ వయసువారికైనా ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచేందుకు హార్వర్డ్ వర్సిటీ చిట్కాలు

Photo Credit: Pinterest