అన్ని కూరగాయలలో కాకరకాయ అత్యంత చేదుగా ఉంటుంది. అందుకే చాలా మంది దూరంగా ఉంటారు. 

Image Credit Unsplash

By Anand Sai
Jul 27, 2025

Hindustan Times
Telugu

కానీ వర్షాకాలంలో శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో, అనేక వ్యాధుల నుండి రక్షించడంలో ఈ కాకరకాయ ముఖ్యమైనది.

Image Credit Unsplash

ఈ కూరగాయ మధుమేహ వ్యాధిగ్రస్తులలో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడమే కాకుండా, శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది.

Image Credit Unsplash

వర్షాకాలంలో జలుబు, ఫ్లూ, ఇతర ఇన్ఫెక్షన్లు చాలా త్వరగా కనిపిస్తాయి. కాకరకాయలో విటమిన్ సి, ఫ్లేవనాయిడ్లు, పాలీఫెనాల్స్ వంటి పోషకాలు ఉంటాయి, ఇవన్నీ యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి.

Image Credit Unsplash

కాకరకాయలో చరాన్టిన్, పాలీపెప్టైడ్-పి, విసిన్ వంటి బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఇన్సులిన్‌ను అనుకరిస్తాయి, ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి.

Image Credit Unsplash

వర్షాకాలంలో మొటిమలు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, చర్మపు చికాకుకు కారణమవుతుంది. కాకరకాయ తింటే చర్మాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి.

Image Credit Unsplash

వర్షాకాలంలో కొన్నిసార్లు జీర్ణక్రియ మందగిస్తుంది. కాకరకాయ పిత్త స్రావాన్ని ప్రోత్సహిస్తుంది. కాలేయం నిర్విషీకరణ విధులను పెంచుతుంది.

Image Credit Unsplash

వర్షాకాలంలో కాకరకాయను ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా, శరీరం నుండి విషాన్ని మూత్రం ద్వారా బయటకు పంపుతుంది.

Image Credit Unsplash

ఈ వర్షాకాలం బత్తాయి జ్యూస్ తో బోలెడు ప్రయోజనాలు

image credit to unsplash