ప్రతిరోజూ గుప్పెడు తెల్లనువ్వులు తింటే ఎముకలు గట్టిపడతాయ్

pixabay

By Haritha Chappa
Jun 29, 2024

Hindustan Times
Telugu

ప్రతిఇంట్లో తెల్లనువ్వులు ఉంటాయి. వీటిని రోజు గుప్పెడు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. 

pixabay

పిల్లలు, మహిళలు ఎముకల బలంగా ఉండాలంటే వారు నువ్వులను ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి.

pixabay

తెల్ల నువ్వుల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, ప్రొటీన్లు, బి విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు నిండుగా ఉంటాయి. 

pixabay

నువ్వులు తినడం వల్ల ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. పెద్ద పేగు ఆరోగ్యాన్ని ఇది కాపాడుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు రావడం తగ్గుతుంది.

pixabay

నువ్వుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. వీటిని తింటే కీళ్ల నొప్పులు తగ్గడంతో పాటూ ఎముకలు గట్టిగా మారుతాయి.

pixabay

హైబీపీ ఉన్నవారు నువ్వులను ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిలో కాల్షియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. 

pixabay

నువ్వులను తినడం వల్ల బ్లడ్ ప్రెషర్ అదుపులో ఉండడం ఖాయం. గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి. 

pixabay

 నువ్వులను తినడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం తగ్గుతుంది.   

pixabay

మరికొన్ని రోజుల్లో తెలుగు రాష్ట్రాల వేసవి సెలవులు ప్రారంభం అవుతున్నాయి. సుమారు 50 రోజుల పాటు సమ్మర్ హాలీడేస్ ఇస్తారు. అయితే విద్యార్థులు సమ్మర్ హాలీడేస్ ను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం.  

pexels