రాత్రివేళ రెండు ఏలకులు తింటే కలిగే లాభాలు ఇవే

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Mar 10, 2024

Hindustan Times
Telugu

ఏలకుల్లో చాలా పోషకాలు ఉంటాయి. ఇవి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. రాత్రివేళ నిద్రించే ముందు ఏలకులు తినడం వల్ల కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి. అవేవో ఇక్కడ చూడండి. 

Photo: Pexels

రాత్రివేళ ఏలకులు తినడం వల్ల నిద్ర మెరుగ్గా పడుతుంది. ఏలకులు నమిలి.. గోరువెచ్చి నీరు తాగడం వల్ల నిద్రలేమి సమస్య తగ్గుతుంది. 

Photo: Pexels

రాత్రి ఏలకులు తీసుకోవడం వల్ల జీర్ణక్రియకు మేలు జరుగుతుంది. మలబద్ధకం లాంటి జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గేందుకు ఇది తోడ్పడుతుంది. 

Photo: Pexels

మీ నోటి నుంచి దుర్వాసన వస్తుంటే.. ఏలకులు మంచి పరిష్కారంగా ఉంటాయి. రాత్రి వేళ ఏలకులు నమలడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది.

Photo: Unsplash

రాత్రివేళ ఏలకులు తినడం వల్ల రక్తప్రసరణ కూడా మెరుగవుతుంది. ఏలకులు నమిలి ఆ తర్వాత గోరువెచ్చని నీరు తాగాలి.

Photo: Unsplash

ఏలకుల్లో విటమిన్ సీ, విటమిన్ బీ6, బీ1, మినరల్స్ ఉంటాయి. దీంతో ప్రతీ రోజూ వీటిని తింటే బరువు తగ్గేందుకు కూడా ఉపకరిస్తాయి. 

Photo: Pexels

వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న శ‌బ‌రి మే 3న థియేట‌ర్ల‌లో రిలీజ్ అవుతోంది. 

twitter