చర్మానికి మేలు చేసే కొలాజెన్‍ను పెంచగల 5 వెజిటేరియన్ ఆహారాలు

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Jul 23, 2024

Hindustan Times
Telugu

చర్మం మృధువుగా, మెరుపుతో, ఆరోగ్యంగా ఉండాలంటే కొలాజన్ అనే ప్రొటీన్ చాలా ముఖ్యం. కొన్ని రకాల ఆహారాలు తినడం వల్ల శరీరంలో ఈ ప్రొటీన్ అధికం అవుతుంది. అలా కొలాజెన్ ఉత్పత్తిని పెంచగల 5 రకాల వెజిటేరియన్ ఆహారాలు ఏవో ఇక్కడ చూడండి. 

Photo: Pexels

స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు సహా బెర్రీల్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సీ అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో కొలాజెన్ స్థాయిలను పెంచగలవు.

Photo: Pexels

గుమ్మడి విత్తనాలు, చియా విత్తనాలు, నువ్వుల్లో కావాల్సిన ఫ్యాటీ యాసిడ్లతో పాటు చాలా పోషకాలు ఉంటాయి. ఇవి తీసుకోవడం వల్ల కొలాజెన్ ఉత్పత్తి అధికం అవుతుంది. 

Photo: Pexels

టమాటాల్లో లిక్టోపిన్ అనే యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. యూవీ డ్యామేజ్ నుంచి కొలాజెన్‍ను ఇది రక్షించగలదు. శరీరంలో ఈ ప్రొటీన్ ఉత్పత్తిని పెంచగలదు. 

Photo: Pexels

బాదంపప్పు, జీడిపప్పు లాంటి నట్స్‌లో ఫ్యాటీ యాసిడ్స్, జింక్ ఉంటాయి. కొలాజెన్ ఉత్పత్తిలో ఇవి కీలకంగా ఉంటాయి. వీటిని రెగ్యులర్‌గా తింటే పోషకాలు అందటంతో పాటు చర్మానికి కూడా మేలు జరుగుతుంది. 

Photo: Pexels

నారింజ, నిమ్మ, చీని లాంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సీ మెండుగా ఉంటుంది. ఇవి శరీరంలో కొలాజెన్ స్థాయిని పెంచి చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరచగలవు. 

Photo: Pexels

రుచి మాత్రమే కాదు.. మామిడి పళ్లతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా..