వేసవిలో తప్పక తీసుకోవాల్సిన 5 రకాల ఫుడ్స్ ఇవి

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Mar 31, 2024

Hindustan Times
Telugu

వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే హైడ్రేషన్‍ను పెంచే.. పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం చాలా ముఖ్యం. అలా.. వేసవిలో రెగ్యులర్‌గా తీసుకోవాల్సిన 5 రకాల ఫుడ్స్ ఏవో ఇక్కడ చూడండి. 

Photo: Pexels

వేసవిలో కీర దోసకాయలు ప్రతీ రోజు తినడం మంచిది. కీర దోసలో ఎలక్ట్రోలైట్స్, విటమిన్ సీ, అధిక వాటర్ కంటెంట్ ఉంటుంది. ఇది శరీరానికి అత్యుత్తమంగా హైడ్రేషన్ అందిస్తుంది. 

Photo: Pexels

స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, బ్లాక్‍బెర్రీలు లాంటి బెర్రీలను సమ్మర్‌లో తినడం చాలా మేలు. వీటిలో అవసరమైన విటమిన్స్, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. 

Photo: Pexels

వేసవి కాలంలో కొబ్బరినీరు రెగ్యులర్‌గా తాగాలి. కొబ్బరినీటిలో పొటాషియమ్, సోడియమ్, మెగ్నిషియమ్, కాల్షియమ్ సహా అవసరమైన ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇవి తాగితే హైడ్రెటేడ్‍గా ఉండొచ్చు. 

Photo: Pexels

వేసవిలో పుచ్చకాయలు, అరటి పండ్లు లాంటి పండ్లు ప్రతీరోజూ తినాలి. ఇవి మీ శరీరాన్ని చల్లబరచగలవు. పుచ్చకాయలో వాటర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. 

Photo: Pexels

వేసవిలో పెరుగు,యగర్ట్ ప్రతీ రోజు తీసుకోవాలి. దీనివల్ల హైడ్రేషన్ పెరగడమే కాకుండా శరీరంలో శక్తి కూడా మెరుగవుతుంది. జీర్ణక్రియకు కూడా ఇవి మేలు చేస్తాయి. వీటిలో ఉండే విటమిన్ బీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

Photo: Unsplash

మొగుడు-పెళ్లాం మధ్య ఏ లొల్లీ రాకుండా కొద్దికాలం పాటు ఉండాలంటే కొన్ని నియమాలు పాటించాలి. 

pexel