ఉదయాన్నే ఎనర్జీ కావాలా.. ఈ డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకొని తినండి

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Feb 09, 2024

Hindustan Times
Telugu

డ్రై ఫ్రూట్స్‌లో చాలా పోషకాల ఉంటాయి. ఇవి తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉంటాయి. కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్‌ను నానబెట్టుకొని ఉదయాన్నే తింటే మంచి ఎనర్జీ వస్తుంది. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.  

Photo: Pexels

ఖర్జూరాలను ముందు రోజు నీళ్లలో నానబెట్టి.. తర్వాతి రోజు ఉదయాన్నే పరగడుపున తింటే చాలా ప్రయోజనాలు దక్కుతాయి. శరీరానికి ఐరన్ బాగా అందుతుంది. ఎముకల దృఢత్వం పెరగడంతో పాటు జీర్ణక్రియకు మేలు జరుగుతుంది. 

Photo: Pexels

రాత్రంతా నానబెట్టిన అంజూర పళ్లు పరగడుపున తింటే బలహీనత తగ్గి.. ఎనర్జీ వచ్చేందుకు సహకరిస్తుంది. రోగ నిరోధక శక్తి, జీర్ణం మెరుగవుతాయి. 

Photo: Pexels

నానబెట్టిన బాదం పప్పును ప్రతీ రోజు ఉదయం తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. ప్రొటీన్లు, ఐరన్, పాస్ఫరస్, ఫైబర్ వీటిల్లో అధికంగా ఉంటాయి. దీంతో శక్తితో పాటు ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. 

Photo: Pexels

ఎండుద్రాక్షను నానబెట్టుకొని ఉదయం తినడం వల్ల చాలా లాభాలు ఉంటాయి. పోషకాలు శరీరానికి మెరుగ్గా అందుతాయి.

Photo: Pexels

ఆక్రోటుకాయల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. వీటిని నానబెట్టుకొని తీసుకోవడం వల్ల జీవక్రియ మెరుగవుతుంది. బ్లడ్ షుగర్ స్థాయి కూడా కంట్రోల్ అయ్యేందుకు ఉపకరిస్తుంది. 

Photo: Pexels

2025లో భారతదేశ టాప్ 10 సంపన్న మహిళలు