బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్న వారికి నట్స్ తినడం చాలా ఉపయోగకరం. వెయిట్ లాస్‍కు ఇవి చాలా మేలు చేస్తాయి. బరువు తగ్గడాన్ని వేగవంతం చేసే ఆరు రకాల నట్స్ ఏవో ఇక్కడ చూడండి.
Photo: Pexels
వాల్‍నట్స్ (ఆక్రోటు)లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ సహా చాలా పోషకాలు ఉంటాయి. శరీరంలో కొవ్వు కరిగేందుకు, ఇన్‍ఫ్లమేషన్ తగ్గేందుకు వాల్‍నట్స్ తోడ్పడతాయి. ఆకలిని తగ్గిస్తాయి. ఇలా ఇవి తింటే బరువు తగ్గేందుకు సహకరిస్తాయి.
Photo: Pexels
బాదంలో ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. దీంతో కడుపు నిండిన ఫీలింగ్‍ను ఎక్కువసేపు ఉంచి ఆకలిని ఇవి తగ్గించగలవు. ఎక్కువ క్యాలరీలు తీసుకోకుండా చేస్తాయి. ఇలా వెయిట్ లాస్‍కు హెల్ప్ చేస్తాయి.
Photo: Pexels
బ్రెజిల్ నట్స్‌లో సెలెేనియం, ఫైబర్, ప్రోటీన్ అధికం. ఇవి తింటే శరీరంలో జీవక్రియ మెరుగ్గా ఉంటుంది. క్యాలరీలు ఎక్కువగా బర్న్ అవుతాయి.
Photo: Freepik
వేరుశనగల్లో ప్రోటీన్ ఎక్కువగా, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఇవి తిన్నా కూడా ఆకలిని తగ్గించగలవు.
Photo: Pexels
జీడిపప్పులో ప్రోటీన్, మెగ్నిషియం ఎక్కువగా ఉంటాయి. ఇవి తిన్నా కూడా కడుపు నిండుగా ఉన్న భావన ఎక్కువసేపు ఉంటుంది. చిటికీమాటికి ఆకలి కాకుండా జీడిపప్పు చేయగలదు.
Photo: Pexels
పిస్తాల్లో క్యాలరీలు తక్కువగా, ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. దీంతో బరువు తగ్గాలనుకునే వారు స్నాక్‍గా ఇవి తింటే అందుకు ఉపకరిస్తాయి.
Photo: Pexels
శరీరంలో రక్తప్రసరణ మెరుగ్గా ఉండేలా చేసే 5 రకాల ఫుడ్స్