రక్త హీనతతో బాధ పడుతున్నారా?.. ఇవి మీ ఆహారంలో చేర్చండి.. 

By Sudarshan V
Feb 19, 2025

Hindustan Times
Telugu

హిమోగ్లోబిన్ అనేది మన శరీరంలో ఆక్సిజన్ సరఫరాకు అత్యంత అవసరం. అది లోపించడం అనేక సమస్యలకు దారితీస్తుంది.

శరీరంలో హిమోగ్లోబిన్ పెరగాలంటే ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి.

బీట్ రూట్ తో ఐరన్, ఫోలేట్, విటమిన్ సి సమృద్ధిగా లభిస్తాయి. ఇది హిమోగ్లోబిన్ ను పెంచడానికి సహాయపడుతుంది.

రోజూ ఉదయం బీట్ రూట్ జ్యూస్ తాగడం ద్వారా రక్తహీనత  సమస్యను అధిగమించవచ్చు.

హిమోగ్లోబిన్ పెరగాలంటే ఖర్జూరం తినడం మంచిది. ఇందులో ఉండే ఐరన్, విటమిన్ బి 12 ఎర్రరక్తకణాలు ఏర్పడటానికి తోడ్పడుతుంది.

అంజీర్ పండ్లలో ఐరన్ మరియు కాల్షియం పుష్కలంగా ఉంటాయి, ఇది శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడానికి సహాయపడుతుంది.

పాలకూర మరియు ఆకుకూరలను మీ ఆహారంలో చేర్చండి. వీటిలో ఐరన్, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి.

దానిమ్మ పండు కూడా రక్తహీనతకు మంచి ఔషధం. ఇందులో ఉండే ఐరన్, విటమిన్ సి రక్తకణాల నిర్మాణానికి తోడ్పడుతుంది.

ఏ వయసువారికైనా ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచేందుకు హార్వర్డ్ వర్సిటీ చిట్కాలు

Photo Credit: Pinterest