శృంగార సామర్థ్యం బాగుండాలంటే ఆరోగ్యంగా ఉండాలి. ప్రధానంగా ఒత్తిడికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఆహారం విషయంలో శ్రద్ధ అవసరం.
image credit to unsplash
అరటిపండులో పొటాషియంతో పాటు విటమిన్ ఎ, బి మొదలైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.. ఇవి సెక్స్ హార్మోన్లను పెంచడానికి సహాయపడతాయి. అరటిపండులోని బ్రోమెలైన్ అనే ఎంజైమ్ మగవారిలో టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుతుంది.
image credit to unsplash
డార్క్ చాక్లెట్ తింటే ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. ఇది లైంగిక ప్రయోజనాల కోసం ప్రభావవంతంగా ఉంటుంది. చాక్లెట్‌లోని ఫెనిలేథైలమైన్, సెరోటోనిన్ వంటివి మిమ్మల్ని ఉత్తేజపరుస్తాయి.
image credit to unsplash
స్ట్రాబెర్రీ గింజల్లో జింక్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. వీర్యం ఉత్పత్తికి అవసరమైన పురుష హార్మోన్ టెస్టోస్టిరాన్‌ను జింక్ నియంత్రిస్తుంది. సెక్స్ కోరికల ఉద్దీపన కలుగజేస్తుంది.
image credit to unsplash
వెల్లుల్లిలో రక్త ప్రసరణను పెంచే అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది మగవారిలో అంగస్తంభనకు సహాయపడుతుంది. వెల్లుల్లి శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ సింథేస్‌ను పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
image credit to unsplash
నట్స్, బాదం, గుడ్డు వంటివి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. వీటిలో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచే సెలీనియం, జింక్‌తో పాటు ఇతర పోషకాలు ఉంటాయి.
image credit to unsplash
గుమ్మడికాయ గింజలు మెరుగ్గా పనిచేస్తాయి. ఇందులో ఉండే జింక్, ఒమేగా -3 కొవ్వు యాసిడ్లు సెక్స్ సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తాయి.
image credit to unsplash
ఈ ఆహారాలు కొంచెం తింటే చాలు జుట్టు ఇట్టే రాలిపోతుంది.. జాగ్రత్త!