ఆరోగ్యానికి విటమిన్-ఈ చాలా ముఖ్యమైనది. రోగ నిరోధక శక్తికి, కణాలు డ్యామేజ్ కాకుండా ఉండేందుకు, కళ్లకు ఈ విటమిన్ కీలకం. ఇది లోపిస్తే ఆరోగ్య సమస్యలెత్తుతాయి. ఆహారం ద్వారా ఈ విటమిన్ పొందొచ్చు. విటమిన్-ఈ పుష్కలంగా ఉండే ఆరు రకాల ఫుడ్స్ ఇవి..
Photo: Pexels
వేరుశనగల్లో విటమిన్-ఈ పుష్కలంగా ఉంటుంది. ఇవి తినడం వల్ల కణాల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. గుండెకు మంచి జరుగుతుంది.
Photo: Pexels
బాదంపప్పులో విటమిన్-ఈ ఎక్కువగా ఉంటుంది. ఇవి శరీరానికి మంచి ఎనర్జీని అందిస్తాయి. రెగ్యులర్‌గా తినడం వల్ల గుండె పనితీరు మెరుగవుతుంది. పూర్తి ఆరోగ్యానికి బాదం మేలు చేస్తుంది.
Photo: Pexels
అవకాడోలో విటమిన్-ఈ మెండుగా ఉంటుంది. యాంటీఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ కూడా ఎక్కువే. ఈ పండు తినడం వల్ల ఆరోగ్యంతో పాటు చర్మానికి కూడా ప్రయోజనాలు దక్కుతాయి.
Photo: Pexels
విటమిన్-ఈ ఎక్కువగా ఉండే ఆహారాల్లో పొద్దుతిరుగుడు విత్తనాలు కూడా ఉన్నాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. శరీరంలోని కణాలను డ్యామేజ్ కాకుండా ఈ విత్తనాలు ఉపయోగపడతాయి.
Photo: Pexels
పాలకూరలో విటమిన్-ఈతో పాటు కీలకమైన పోషకాలు మెండుగా ఉంటాయి. ఐరన్, కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది. పాలకూర తినడం వల్ల పూర్తిస్థాయి ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
Photo: Pexels
చిలగడదుంపల్లో విటమిన్-ఈ, బీటా కరోటిన్ మెండుగా ఉంటాయి. ఇవి తినడం వల్ల రోగ నిరోధక శక్తి మెరుగవుతుంది. గుండెకు కూడా మంచిది.
Photo: Pexels
బంగాళదుంపలతో ఫ్రై మాత్రమే కాదు- ఇవి చేసుకున్నా నోరూరిపోతుంది!