జలుబు చేసినప్పుడు ముక్కు దిబ్బడ చాలా ఇబ్బందిగా ఉంటుంది. శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. కొన్ని రకాల ఫుడ్స్ ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం కలిగేందుకు ఉపయోగపడతాయి.
Photo: Pexels
ముక్కు దిబ్బడ తగ్గేందుకు సహకరించే ఐదు రకాల ఫుడ్స్ ఏవో ఇక్కడ చూడండి. వీటిని మీ ఆహారంలో తీసుకోవడం వల్ల ముక్కు దిబ్బడ తగ్గేందుకు తోడ్పడతాయి.
Photo: Pexels
అల్లంలో యాంటీఆక్సిడెంట్, యాంటీఇన్‍ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. అందుకే ముక్కు దిబ్బడపై ఇది ప్రభావం చూపిస్తుంది. అల్లంతో టీ సహా డ్రింక్స్ చేసుకొని తాగడం, ఆహారంలో వేసుకొని తినడం వల్ల దిబ్బడ తగ్గేందుకు ఉపయోగపడుతుంది.
Photo: Pexels
పసుపులో ఉండే కుర్కుమిన్ అనే కాంపౌడ్ ఇన్ఫెక్షన్లను తగ్గించగలదు. ముక్కు దిబ్బడ నుంచి కూడా ఉపశమనం అందించగలదు. జలుబు ఉన్నప్పుడు పసుపును పాలు, నీరు లేదా ఇతర పానియాల్లో వేసుకొని తాగడం మంచిది. ఆహారాల్లో కాస్త ఎక్కువగా వేసుకోవచ్చు.
Photo: Pexels
తేనెలోని ఔషధ గుణాలు కూడా ముక్కు దిబ్బడను తగ్గిస్తాయి. అందుకే ఈ సమస్య ఉన్నప్పుడు తేనె తీసుకోవడం మంచిది.
Photo: Pexels
గుమ్మడి గింజల్లో యాంటీఇన్‍ఫ్లమేటరీ గుణాలు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి తింటే ముక్కు దిబ్బడ, ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం కలిగేందుకు సహకరిస్తాయి.
Photo: Pexels
పైనాపిల్‍లో బ్రోమలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది కూడా ముక్కు దిబ్బడ తగ్గేందుకు ఉపకరిస్తుంది. నారింజ పండులో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కూడా ముక్కు ఇన్ఫెక్షన్లను తగ్గించగలవు.
Photo: Pexels
రిపబ్లిక్ డే గురించి ప్రతిఒక్కరూ తెలుసుకోవాల్సిన అంశాలు ఇవిగో