ఆరోగ్యానికి మేలు చేసే ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉండే 5 రకాల ఫుడ్స్ ఇవి

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Mar 28, 2024

Hindustan Times
Telugu

యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉండే ఫ్లేవనాయిడ్స్ వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. రోగనిరోధక శక్తి పెరగడం సహా మరిన్ని ప్రయోజనాలుఉంటాయి. అలా ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉండే 5 ఆహారాలు ఇవి. 

Photo: Pexels

స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీలు, బ్లాక్‍బెర్రీలు లాంటి బెర్రీలో ఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఇవి తింటే ఆరోగ్యం మెరుగవుతుంది. 

Photo: Pexels

పాలకూర, బ్రకోలీ, కేల్ లాంటి ఆకుకూరల్లోనూ కేంఫొరేల్, క్వెర్సిటిన్ లాంటి ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవి తింటే గుండె ఆరోగ్యం పెరగడంతో పాటు మంట సమస్యలు తగ్గుతాయి. 

Photo: Pexels

నారింజ, నిమ్మ, చీనీ లాంటి సిట్రస్ పండ్లలో హెస్పెరిడిన్, నారిన్‍జెనిన్ లాంటి ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవి తిన్నా ఓవరాల్ ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. 

Photo: Pexels

ఉల్లిపాయల్లో క్వెర్‌సెటిన్ పుష్కలంగా ఉంటుంది. ప్రతీ రోజు ఉల్లిపాయలు తీసుకోవడం వల్ల దీర్ఘకాల వ్యాధులు తగ్గేందుకు ఉపకరిస్తాయి. 

Photo: Pexels

గ్రీన్ టీలో కాట్చెన్స్ అనే ఫ్లేవనాయిడ్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని ప్రతీ రోజు తాగితే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. 

Photo: Pexels

వేసవిలో కంటి ఆరోగ్యం కాపాడుకోవటం ఎలా....? ఈ 7 విషయాలు తెలుసుకోండి

image credit to unsplash