శరీరంలో రక్తప్రసరణ మెరుగ్గా ఉండేలా చేసే 5 రకాల ఫుడ్స్
Photo: Pexels
By Chatakonda Krishna Prakash Jan 11, 2025
Hindustan Times Telugu
కొందరిలో రక్త ప్రసరణ సరిగా లేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటుంటారు. ఈ ఇబ్బందిని ఎదుర్కొనే వారు సంఖ్య ఎక్కువవుతోంది. రక్త ప్రసరణ సరిగా లేకపోతే నొప్పులు, జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. అవయవాల పనితీరు తగ్గుతుంది.
Photo: Pexels
శరీరంలో రక్త ప్రసరణ పెరిగేందుకు కొన్ని రకాల ఆహారాలు తోడ్పడతాయి. అవేవో ఇక్కడ చూడండి.
Photo: Pexels
విటమిన్ సీ ఎక్కువగా ఉండే నారింజ, చీని లాంటి పండ్లను తినడం వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది. రక్త నాళాలకు ఇవి మేలు చేస్తాయి.
Photo: Pexels
ఉల్లిపాయలో ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. ధమనులు విస్తరించేలా చేసి రక్త ప్రసరణను ఇవి పెంచుతాయి. బ్లడ్ ఫ్లో బాగుంటుంది.
Photo: Pexels
నైట్రిక్ ఆక్సైడ్ ఎక్కువగా ఉండే మిర్చి, దాల్చిన చెక్క, క్యాప్సికం లాంటివి తీసుకోవడం వల్ల రక్త ప్రసరణకు మేలు జరుగుతుంది. శరీరంలో రక్తం సరఫరా బాగా జరుగేందుకు తోడ్పడతాయి.
Photo: Pexels
దానిమ్మ పండులో పోలిఫెనాల్ యాంటీఆక్సిడెంట్లు, నైట్రేట్స్ అధికంగా ఉంటాయి. బాడీలో రక్త ప్రసరణను ఇవి మెరుగుపచగలవు.
Photo: Pexels
బీట్‍రూట్‍లోనూ నైట్రేట్స్ ఎక్కువ. ఇవి తినడం వల్ల రక్తనాళాలు రిలాక్స్ అవుతాయి. కండరాల కణాలకు రక్తం బాగా అందుతుంది.
Photo: Pexels
అల్సర్లు ఉంటే కచ్చితంగా తినకూడని ఆహారాలు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి