50 ఏళ్ల వయసులో 25 ఏళ్ల వారిలా కనిపించాలంటే ప్రతిరోజూ తినాల్సిన 5 యాంటీ ఏజింగ్ ఫుడ్స్

Malaika Arora/ Instagram

By Sudarshan V
May 07, 2025

Hindustan Times
Telugu

వయస్సు ప్రభావం మీ చర్మంపై పడుతోందా? మీరు ముఖంపై ముడతలతో బాధపడుతున్నారా? అయితే, మీ ఆహారంలో యాంటీ ఏజింగ్ ఆహారాన్ని చేర్చుకోవాల్సిందే.

Malaika Arora/ Instagram

అవోకాడో

అవకాడోలోని ఆరోగ్యకరమైన కొవ్వులు చర్మాన్ని తేమగా ఉంచుతాయి, ఇది ముఖంపై ముడతలను తగ్గిస్తుంది. ప్రకాశవంతంగా ఉంచుతుంది.

PIXABAY

బ్లూబెర్రీ

యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే ఈ పండు చర్మ కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. వృద్ధాప్య వేగాన్ని తగ్గిస్తుంది.

PIXABAY

టమోటా

టమోటాల్లో ఉండే లైకోపీన్ అనే మూలకం సూర్యుని హానికరమైన కిరణాల నుంచి చర్మాన్ని రక్షించి స్కిన్ టోన్ ను మెరుగుపరుస్తుంది.

PIXABAY

గ్రీన్ టీ

ఇందులో కాటెచిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది చర్మం యొక్క స్థితిస్థాపకతను పెంచడం ద్వారా వృద్ధాప్య సంకేతాన్ని నెమ్మదిస్తుంది.

PEXELS

గింజలు

 డ్రై ఫ్రూట్స్, నట్స్ లో ఉండే విటమిన్స్, ఫ్యాటీ యాసిడ్స్ చర్మాన్ని బిగుతుగా ఉంచడంతో పాటు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

PEXELS

సూచన: ఈ సలహాలు సాధారణ సమాచారం కోసం మాత్రమే. నిర్ణయం తీసుకునే ముందు వైద్య నిపుణులను సంప్రదించండి.

శని దోషం తొలగిపోవాలంటే చేయాల్సిన పనులు ఇవే!