నెలపాటూ రోజుకు పది మఖానాలు తిని చూడండి ఎంత ఆరోగ్యమో

Image Credits: Adobe Stock

By Haritha Chappa
Mar 27, 2025

Hindustan Times
Telugu

మఖానాలు క్రంచీ చిరుతిండి మాత్రమే కాదు, యాంటీఆక్సిడెంట్లు, మెగ్నీషియం, కాల్షియం నిండిన పవర్హౌస్. నెల రోజుల పాటు రోజూ 10 మఖానాలు తింటే మీకెంతో ఆరోగ్యం దక్కుతుంది.

Image Credits: Adobe Stock

యాంటీఆక్సిడెంట్లతో లోడ్ చేయబడిన, మఖానా మీ శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తో పోరాడగలదు, ఇది ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది.  దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 

Image Credits : Adobe Stock

మీ దినచర్యలో మఖానా తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ.  రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి సహాయపడుతాయి,. ఇది డయాబెటిస్ ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది.

Image Credits: Adobe Stock

బరువు తగ్గేందుకు మఖానా తింటూ ఉండాలి. ఈ చిన్న గింజలలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇది మీకు ఎక్కువసేపు పొట్ట నిండిన అనుభూతి కలుగుతుంది.కాబట్టి వీటినితినడం వల్ల బరువు సులువుగా తగ్గుతారు.

Image Credits: Adobe Stock

మఖానాలోని యాంటీఆక్సిడెంట్లు, అమైనో ఆమ్లాలు ముడతలను తగ్గించి, చర్మం యవ్వనంగా, ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తాయి. మఖానాలను క్రమం తప్పకుండా తినాలని నిర్ధారించుకోండి.

Image Credits: Adobe Stock

మఖానాలో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ప్రోటీన్, ఫైబర్, జింక్ ఉంటాయి.  ఇవన్నీ రక్తపోటును అదుపులో ఉంచేందుకు,  గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి.

Image Credits: Adobe Stock

ఆర్థరైటిస్ లేదా ఇతర కీళ్ల నొప్పుల సమస్యలను తగ్గించేందుకు మఖానా సహాయపడుతుంది. దీని లక్షణాలు కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి, ఇది ఎముక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

Image Credits: Adobe Stock

కిడ్నీలో రాళ్ల సమస్యను తగ్గించేందుకు ఇవి ఎంతో సహాయపడతాయి. కిడ్నీల్లో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి.

Image Credits: Adobe Stock

సంతానోత్పత్తి సమస్యలు ఉన్నవారు మఖానా తినడం అలవాటు చేసుకోవాలి.

Image Credits: Adobe Stock

బ్లాక్ డ్రెస్‍లో బిగ్‍బాస్ భామ హాట్ షో: ఫొటోలు

Photo: Instagram