వాల్‍నట్స్ నానబెట్టుకొని తింటే ఈ ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు

Photo: Unsplash

By Chatakonda Krishna Prakash
Jun 15, 2024

Hindustan Times
Telugu

వాల్‍నట్స్ (ఆక్రోటు)లో ఫైబర్, విటమిన్లు, కాల్షియమ్, ఐరన్, ప్రొటీన్, హెల్దీ ఫ్యాట్స్ సహా చాలా పోషకాలు ఉంటాయి. వీటిని మామూలుగా కంటే నానబెట్టుకొని తింటే పోషకాలు బాగా అందుతాయి. వాల్‍నట్స్‌ను నానబెట్టుకొని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.

Photo: Unsplash

వాల్‍నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటుంది. అందుకే వీటిని నానబెట్టి తింటే ఛాతిలో మంట తగ్గేందుకు తోడ్పడుతుంది. కొలెస్ట్రాల్ లెవెళ్లు నియంత్రణలో ఉండేందుకు తోడ్పడి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. 

Photo: Pixabay

వాల్‍నట్స్‌లో విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది. ఇవి తింటే మెదడు పనితీరుకు మేలు జరుగుతుంది.

Photo: Pixabay

బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను వాల్‍నట్స్ తగ్గించగలవు. అందుకే డయాబెటిస్ ఉన్న వారు తినేందుకు ఇది బెస్ట్ స్నాక్ ఆప్షన్‍గా ఉంటుంది. 

Photo: Pixabay

వాల్‍నట్స్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆక్సిడేటివ్, కణాల డ్యామేజ్ నుంచి ప్రొటెక్షన్ కల్పిస్తాయి. 

Photo: Pixabay

వాల్‍నట్స్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. కడుపు ఆరోగ్యం మెరుగవుతుంది. వీటిలో ఉండే విటమిన్-ఈ చర్మానికి మంచి చేస్తుంది.

Photo: Pixabay

పెరుగులో చియా సీడ్స్ కలిపి తింటే ఏమవుతుంది..! ఈ విషయాలు తెలుసుకోండి