తామర గింజల వాడకం ఇటీవల పెరుగుతోంది. తామర విత్తనాలను ఆహారంలో ఉపయోగిస్తారు. దీనితో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

Unsplash

By Anand Sai
Aug 12, 2024

Hindustan Times
Telugu

తామర గింజలను రోజుకు 2 లేదా 4 సార్లు కొన్ని తినడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయి. ఆరోగ్యంపై ఎలాంటి సానుకూల ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.

Unsplash

తామర గింజల్లో కూడా కాల్షియం లభిస్తుంది. ఈ కాల్షియం ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

Unsplash

నిద్రలేమి సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. పడుకునే ముందు ఒక గ్లాసు పాలలో తామర గింజల పొడి లేదా గింజలు వేసి బాగా మరిగించి తాగాలి. ప్రశాంతమైన నిద్రను వస్తుంది.

Unsplash

కండరాల నొప్పి వంటి సమస్యలను ఎదుర్కొంటున్న వారు తామర గింజలను తినవచ్చు. ముఖ్యంగా పిల్లలకు తామర గింజలు ఇస్తే వారి కండరాలు వేగంగా పెరుగుతాయి.

Unsplash

లోటస్ ఫ్లవర్ సీడ్స్‌లో మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్, ఐరన్, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. పురుషులలో లిబిడో పెరుగుతుంది.

Unsplash

డయాబెటిస్‌తో బాధపడేవారు ఫైబర్ అధికంగా ఉండే తామర గింజలను తినవచ్చు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు మధుమేహం ప్రభావాలను నియంత్రిస్తాయి.

Unsplash

తామర గింజలలోని  ఎంజైములు శరీరంలో ప్రొటీన్ల ఆరోగ్యాన్ని పెంపొందించడంలో చురుకైన పాత్ర పోషిస్తాయి. దీని వల్ల ఆరోగ్యకరమైన చర్మం వస్తుంది.

Unsplash

ఆయుర్వేదం ప్రకారం కొన్ని ఆహారాల కలయిక జీర్ణ సమస్యలు, శరీరంలో టాక్సిన్స్ విడుదల, ఆరోగ్య సమతుల్యతను దెబ్బతీస్తాయి. ఆయుర్వేద నిపుణలు ఈ 10 ఆహార కలయికలను వద్దని సూచిస్తున్నారు.  

pexels