కీరదోస తొక్క తీయాలా వద్దా? ఎలా తింటే ఎక్కువ ప్రయోజనాలు?

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
May 14, 2024

Hindustan Times
Telugu

కీరదోస కాయలను వేసవి రెగ్యులర్‌గా తింటే చాలా మేలు. కీరదోసలో పోషకాలతో పాటు వాటర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. అందుకే ముఖ్యంగా ఎండాకాలంలో కీరదోస తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. 

Photo: Unsplash

అయితే, కీరదోస కాయలను తొక్కతో తింటే మంచిదా.. తొక్క తీసి తినాలా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. 

Photo: Pexels

వైద్యనిపుణుల ప్రకారం, కీరదోస కాయలను తొక్క తీయకుండా తింటేనే శరీరానికి ఎక్కువ ప్రయోజనాలు దక్కుతాయి. తొక్కలోనూ విటమిన్ కే, ఫైబర్ లాంటి పోషకాలు ఉంటాయి. తొక్క తీసేస్తే అందులోని కొన్ని పోషకాలను కోల్పోవాల్సి వస్తుంది. 

Photo: Unsplash

అందుకే, కీరదోస కాయలను తొక్కతోనే తినాలి. అయితే, తినే ముందు  కీరదోసను నీటితో శుభ్రంగా కడగాలి. అవసరమైతే గోరు వెచ్చని నీటితో క్లీన్ చేసుకుంటే మంచిది. 

Photo: Unsplash

కీరదోసలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే వేసవిలో దీన్ని తినడం వల్ల శరీరానికి హైడ్రేషన్ అత్యుత్తమంగా అందుతుంది. 

Photo: Unsplash

కీరదోసలో కొన్ని విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ ఉంటాయి. అందుకే బరువు తగ్గేందుందుకు, కంటి చూపు మెరుగుపడేందుకు, చర్మానికి కూడా ఇది చాలా మేలు చేస్తుంది. 

Photo: Unsplash

నీరు తాగడం వల్ల శరీరంలో కలిగే మార్పులేంటి?

pexel